జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి ఒక వ్యక్తి యొక్క పాపాలను దేవుడు అనుమతించినట్టు వాక్యంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు.
కాని మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎందుకంటే సాతాను 'మనం పాపులం కాదు బాధితులం' అనే నమ్మకాన్ని గట్టిగా మనలో కలిగించాడు కాబట్టి.
మనం చేసే పాపాలు మనకున్న అభద్రత, మనపై మనకు నమ్మకం లేకపోవడం, సరైన పెంపకం లేకపోవడం, అవకాశాలు లేకపోవడం లేక కఠినమైన పరిస్థితులే కారణం అని వాటిని సాకులుగా చెప్పుకుంటాం.
కాని దేవుడు తన పరిశుద్ధ గ్రంధంలో నుండి ఒక అద్భుతమైన ఉదాహరణను మన ముందు ఉంచాడు.. ఆ ఉదాహరణ "బాధితులం" అనే మనస్తత్వాన్ని మనలో నుండి తరిమేస్తుంది!
అది యవ్వనస్తుడైన యోసేపు యొక్క యదార్ధమైన జీవిత కధ (ఆదికాండము 37-50):
వైవాహిక సంబంధాలు సరిగ్గా లేని కుటుంబం, హత్య, ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉండటం, ఈర్ష్యతో ఉన్న అన్నలు.. తనను బానిసత్వంలో అమ్మివేయడం.. ఒక అబద్దం ఆడిన స్త్రీ వలన చెరసాలలో త్రోసివేయబడటం, తన కుటుంబం నుండి పూర్తిగా వేరుచేయబడి, తనది కాని అన్యదేశంలో జీవించడానికి బలవంతంగా తేబడటం.
దీనంతటివలన అతను తనపై తాను జాలితో నిండిపోయి, భయం తిరస్కారాలతో పనికిరాకుండాపోయిన స్థితికి వెళ్లిపోవచ్చు. కాని తాను సరైన దానిని ఎంచుకున్నాడు.. తనను హింసకు గురిచేసిన వారిని క్షమించాడు, తన పరిస్థితులు ఎలాంటివైనా దేవునిపై నమ్మకముంచాడు, తన జీవితాన్ని ఉత్తమమైన రీతిలో నడిపించుకున్నాడు.
మనం కూడా అదే చేయడం ఇప్పటినుండైనా మొదలుపెడదామా? ఎందుకంటే క్రీస్తులో ఉన్నవారు ఎవ్వరూ బాధితులు కారు *
-------------------------
దయచేసి దీనిని పాపం అనే సందర్భంలో అర్థం చేసుకోండి. ఇతరులు చేసిన నేరాలకు లేక వేసే నిందలకు బాధితులు ఉండరని నేను చెప్పట్లేదు. నేను చెప్పేదేంటంటే మనం బాధితులం కాబట్టి మనం పాపాలు చేయడం అనేది సమంజసమే లేక అనుమతించబడుతుంది అని అనుకోవడం తప్పుడు ఆలోచన అని.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.