రోమీయులకు 12:14-21 - ఒక వింతైన ఆలోచన


రోమీయులకు 12 లోకానికి వింతగా అనిపించే ఒక అద్భుతమైన ఆలోచనను వివరిస్తుంది.. శత్రువు తలపై నిప్పులు కుప్పగా పోయటం అనే దాని గురించి కూడా చూద్దాం!


ఎవరైనా మన విషయంలో చెడుగా ప్రవర్తిస్తే, వారికి కూడా అదే తిరిగి ఇవ్వడం మన సహజమైన స్పందన. ఎవరైనా మూర్ఖంగా, పిసినిగా, పొగరుగా, విమర్శించేవారిగా, తొందరతో ఉండే వ్యక్తిగా ఉంటే వారికి కూడా మనం అదే తిరిగి ఇవ్వాలని, దానికే వారు అర్హులని మనం అనుకుంటాం.


కాని దేవుడు ఒక వింతైన ఆజ్ఞను రోమీయులకు 12 లో మనకు ఇచ్చారు (వాక్యంలో ఇంకా అనేక చోట్ల కూడా):


మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు. కీడుకు ప్రతికీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము. (రోమీయులకు 12:14, 17, 19-21)


దేవుడు ఒక మంచి ఉద్దేశంతోనే మన సహజ స్వభావానికి వ్యతిరేకంగా చేయమని మనలను ఎప్పుడూ పిలుస్తూ ఉంటాడు.


~ మనం ఇతరులను మార్చలేము, కాని మనం వారిలాగా మారిపోకుండా జాగ్రత్తపడగలం.


~ మనం ఇతరులను మార్చలేము, కాని మనం ఒప్పుకుంటే దేవుడు మనలను మార్చగలడు (ఫిలిప్పీయులకు 2:12-13).


మనం ఎపుడైతే ద్వేషానికి ప్రేమను తిరిగి ఇస్తామో, పిసినితనానికి దాత్రుత్వాన్ని ఇస్తామో, చెడుకి మంచినిస్తామో, మన విషయంలో అదే చేసిన మన ప్రభువును మనం వెంబడిస్తున్నాం అని అర్థం.


దేవుని ఆజ్ఞలు పడిపోయిన మన ప్రపంచానికి వెర్రితనంగా అనిపిస్తాయి.. కాని క్రైస్తవులంగా మనకు తెలుసు అవి మనలను మార్చగలిగే సత్యాలని.

-----------

'శత్రువు తలమీద నిప్పులు కుప్పగా పోయుట' అంటే అర్ధమేమిటి?'


దీని ఖచ్చితమైన అర్ధం ఏమిటంటే  బాధపెట్టడం వల్ల కాదు గాని, ప్రేమించడం వలన మన శత్రువుకు నొప్పి కలుగచేయటం అనమాట. వారు దానిని గుర్తించినా గుర్తించకపోయినా, మన ప్రేమ వారిని సిగ్గుపడేలా చేస్తుంది. ఒకోసారి ఇది వారిని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది, ఒకోసారి నడిపించకపోవచ్చు. అది వారిని మార్చినా మార్చకపోయినా, మనలను మాత్రం ఖచ్చితంగా మారుస్తుంది, మన విశ్వాసాన్నీ ధృడపరుస్తుంది.


సామెతలు 25:21-22


కీడుకు మేలును చేయడానికి మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చే వాక్యభాగాలు :

• మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి (లూకా 6:27)

• మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా మీకు మేలు చేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా (లూకా 6:32,33)

• మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. (సామెతలు 15:1)


Romans 12:14-21 - A Crazy Idea!రోమీయులకు 12 లోకానికి వింతగా అనిపించే ఒక అద్భుతమైన ఆలోచనను వివరిస్తుంది.. శత్రువు తలపై నిప్పులు కుప్పగా పోయటం అనే దాని గురించి కూడా చూద్దాం!
No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.