ఏమీ ఆశించకుండా యేసుని ప్రేమించడం

నా విశ్వాసంలో ఒక లోపమును గ్రహించి, నేను పశ్చాత్తాప పడవలసి వచ్చింది. నన్ను నేనే వేసుకున్న ప్రశ్నను మీకు మీరే వేసుకోవాలని ప్రోత్సాహిస్తున్నాను.


నేను యేసును ఆయన కోసం కాక ఆయన ద్వారా వచ్చే లాభల కోసమే ప్రేమిస్తున్నానని నా జీవితంలో ఒకానొక సమయంలో గ్రహించాను. నిత్యజీవంతో నాకు తృప్తి లేదు, ఈ జీవితంలో అన్నీ కావాలి ఇప్పుడే ఇక్కడే అన్నట్టు.


నా హృదయం కొన్ని సంగతుల వల్ల తీవ్రంగా గాయపడినప్పుడు, నా కలలన్నీ నాశనం అయిపోయినప్పుడు, నా జీవితం చెల్లాచెదురైపోయి శాశ్వతంగా మారిపోయినప్పుడు కానీ నాకు ఈ గ్రహింపు కలుగలేదు. అలాంటి సంగతులు జరిగినపుడు దేవుని మీద చాలా కోపం వచ్చింది. ఆయన నాకు బాకీ ఉన్నట్టుగా నేను భావించాను.


యోహాను 6:26-27 లో ఉన్న జనాలు యేసును ఆత్రుతతో వెంబడించారు... యేసు అంటే ప్రేమతో కాదు గాని ఆయన ఇచ్చే ఆహారం కోసమే. నేనూ వారిలో ఒకరిగా ఉండేదాన్ని.


యేసుపై ప్రేమలో, ఆయనను అర్ధం చేసుకోవడంలో, నాలో ఉన్న లోపానికి దుఖించి పశ్చాత్తాప పడ్డాను.



కాని ఆ వైఖరి ఇప్పటికీ అపుడపుడు నాలో కనిపిస్తూనే ఉంటుంది.. కాని నా భూసంబంధమైన జీవితం ఎలా ఉన్నా గాని, యేసు నా అర్హతకు మించే అన్నీ నాకు ఇచ్చేరని మరలా నాకు నేనే గుర్తుచేస్తూ చెప్పుకుంటూ ఉంటాను.


యేసును ఏమీ ఆశించకుండా ప్రేమించేలాగా సహాయం చేయమని ఈరోజు నాతో కలిసి దేవుని అడుగుతారా?


Loving Jesus No Strings Attached



నా విశ్వాసంలో ఒక లోపమును గ్రహించి, నేను పశ్చాత్తాప పడవలసి వచ్చింది. నన్ను నేనే వేసుకున్న ప్రశ్నను మీకు మీరే వేసుకోవాలని ప్రోత్సాహిస్తున్నాను.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.