అంతరంగ సౌందర్యం

picture

దేవుడు మనలను అంతరంగంలో సౌందర్యం కలిగిన వ్యక్తులుగా చేస్తారు...


అందంగా కనబడాలని సగటు ఆడవారు వారి జీవితంలో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కాని అవి బహుశా కేవలం బాహ్యంగా ఉండే లోపాలనే కప్పిపెడతాయేమో.


కాని అంతరంగలో ఉండే లోపాల సంగతి ఏంటి? స్వార్ధం, చేదైనా స్వభావం, స్వజాలి, లేక కోపం.. ఇంకా ఇలా ఇతరమైన లోపాల సంగతి ఏంటి అని.


మనందరం పుట్టుకతోనే అందంగా పుట్టిన వారం కాకపోవచ్చు. ఒకవేళ అలా అయినా, వయస్సుతోపాటు ఆ అందం కూడా వాడిపోయేదే. కాని అంతరంగ సౌందర్యం కలిగి ఉండటం అనేది అందరికీ అందుబాటులో ఉన్నది.


జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. (1 పేతురు 3:3, 4)


"అంతరంగలో సౌందర్యం" పొందటానికి కొన్ని పద్ధతులు :


1. ప్రార్ధనయందు నిలకడగా ఉండాలి (కొలస్సీయులకు 4:2).
2. దైవ వాక్యాలను కంఠత పెట్టాలి (కీర్తనలు 119:11).
3. దేవుని చిత్తాలకు జీవితాన్ని అంకితం చేసుకోవాలి (ఎఫెస్సీయులకు 2:10, 1 తిమోతి 5:9-10).
4. ఎల్లపుడు కృతజ్ఞత కలిగి ఉండటం సాధన చెయ్యాలి (1 థెస్సలోనిక 5:18).


బాహ్య సౌందర్యం పెంచుకోవడం కంటే అంతరంగ సౌందర్యం పెంచుకోవడం చాలా విలువైనది. ఎందుకంటే ఆ సౌందర్యం బయట చర్మం కంటే లోతైనది. దాని ప్రయోజనాలు శాశ్వతమైనవి.


* మొగవారు కూడా అంతరంగ సౌందర్యాన్ని పెంచుకునే అవసరత చాలా ఉంది!


Inner Beauty


"అంతరంగ సౌందర్యానికి", చర్మం కంటే లోతైన, శాశ్వతమైన విలువను అందించే నాలుగు సూత్రాలను ఈరోజు ఒక్క నిమిషంలో చదువగలిగిన వాక్యధ్యానంలో చూద్దామా!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.