నాకెప్పుడూ ఒక అనుమానం.. ఆధునిక క్రైస్తవులకు నాతో సహా, దేవునియందు భయం కలిగి ఉండటం అంటే ఏంటో అసలు అర్ధం తెలుసా అని.
గతించిన తరాలవారు దేవుని ఉగ్రతపై విపరీతంగా దృష్టి పెడితే, ఆధునిక క్రైస్తవులం అయిన మనం అసలు దానిని పూర్తిగా పట్టించుకోకుండా ఉన్నాం.
అసలు భయానికి స్థానం లేని ఒక మృదువైన, అన్నిటినీ ఒప్పుకునే మన సొంత దేవుణ్ణి మనమే సృష్టించుకున్నాం అనిపిస్తుంది.
ఒక నేరస్తుడు నిజాయితీపరుడైన పోలీస్ ని లేక దైవికమైన న్యాయమూర్తిని చూస్తే ఎంత భయపడతాడో, అలాంటి భయం ఎవరైతే యేసుని తృణీకరిస్తారో వారు కలిగి ఉండాలి (రోమీయులకు 1:18; హెబ్రీయులకు 10:31).
దేవుని ఉగ్రతకు క్రైస్తవులంగా మనమింక భయపడకూడదు (1 యోహాను 4:18), కాని ఉగ్రత అనేది దేవుని గుణలక్షణాలలో ఇంకా భాగమే అనే విషయం మనం మర్చిపోకూడదు. దానిని ఒప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు (యిర్మీయా 9:23-25).
పరిశుద్ధమైన భయం మనలో దేవునియందు గౌరవాన్ని, ప్రేమను, నమ్మకాన్ని, ఆదరణను, తృప్తిని, శాంతిని పురిగొల్పుతుంది.
అంతమాత్రమే కాదు విధేయతను, నిబద్దతను, ఆయన గుణలక్షణాలలో ప్రతీదాన్ని ఆయన ఉగ్రతతో సహా లోతుగా గౌరవించి అంగీకరించే స్వభావాన్నీ పురిగొల్పుతుంది....
దేవుని చర్యలను తీర్పు తీర్చడం, ఆయన వాక్యంతో వాదించడం, ఆయన ఆజ్ఞలను పట్టించుకోకపోవడం లాంటివి చేయడానికి మనం సరిపోము అని ఆ దైవికమైన భయం మనకు నేర్పుతుంది.. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన, భయంకరమైన జ్ఞానవంతుడు మరియు న్యాయవంతుడు గనుక.
---------------------
పరిశుద్ధమైన భయం మనం కలిగి ఉండటానికి సహాయపడే ఈ క్రింది వాక్యభాగాలు మనందరికోసం :
కీర్తనలు 25:12; కీర్తనలు 31:19; కీర్తనలు 33:18; కీర్తనలు 34:7; కీర్తనలు 34:9; కీర్తనలు 85:9; కీర్తనలు 103:11; కీర్తనలు 112:1; కీర్తనలు 115:11; కీర్తనలు 115:13; కీర్తనలు 128:1; కీర్తనలు 145:19; కీర్తనలు 147:11; సామెతలు 1:7; సామెతలు 10:27; సామెతలు 14:26-27; సామెతలు 15:16; సామెతలు 19:23; సామెతలు 22:4; సామెతలు 28:14; ప్రసంగి 7:18; ప్రసంగి 8:12-13; యెషయా 33:6; మలాకి 3:16-17; మలాకి 4:2; లూకా 1:50; ప్రకటన 11:18.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.