యేసు ప్రభుని ఆఖరి ఏడు మాటలు

యేసు ప్రభువు తాను మరణం పొందే ముందు సిలువపై పలికిన ఏడు అపురూపమైన మాటలను ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


మరణమవుతున్న రక్షకుని ఆఖరి మాటలను ధ్యానించడానికి కొంత సమయం తీసుకుందాం :


1. "యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు." (లూకా  23:34)

• యేసుని సిలువేసిన సైనికులకు కూడా క్షమాపణ దొరకుతుంది వారు ఆశిస్తే !


2. "నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు." (లూకా 23:43)

• అదేరోజు పరలోకంలో ఉంటాడని చనిపోబోతున్న దొంగకి యేసు నిశ్చయతనిచ్చాడు! ఈ ఒక్క మాటలో ఎన్నో లోతైన సత్యాలు ఉన్నాయి.


3. "అమ్మా, యిదిగో నీ కుమారుడు." (యోహాను 19:26-27)

• తల్లిదండ్రులను గౌరవించాలని ఈ మాటను యేసు ఉపయోగించడం జరిగింది.


4. "ఏలీ, ఏలీ, లామా సబక్తానీ." (ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.) (మత్తయి 27:46; కీర్తనలు 22:1 లో దీని ప్రవచనాన్ని గమనించగలం)

• యేసు మనందరి పాప శిక్షను సిలువపై భరించినప్పుడు తండ్రి తనను ఎడబాసిన అనుభవమే యేసు భరించిన అన్ని శ్రమలకంటే తీవ్రమైనది.


5. "దప్పిగొనుచున్నాను." (యోహాను 19:28; కీర్తనలు 69:21 లో దీని ప్రవచనాన్ని గమనించగలం)

• సంపూర్ణ మానవుడుగా యేసు మన పాపముల నిమిత్తం శారీరికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా శ్రమపొందాడు.


6. "సమాప్తమైనది." (యోహాను 19:30).

• మరణం అంతమొందింది. ఏ మానవుడు ఎప్పటికీ సాధించలేనిది యేసు సాధించాడు.


7. "తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను." (లూకా 23:46)

• తండ్రితో యేసుకు ఉన్న అందమైన అనుబంధం ఒక మర్మమైనా, ఈ మాట ఆ బంధంలోనికి ఒక్క క్షణం అలా తొంగిచూసే అవకాశం ఇచ్చింది.


Christ's 7 Final Statements


యేసు ప్రభువు తాను మరణం పొందే ముందు సిలువపై పలికిన ఏడు అపురూపమైన మాటలను ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.