ఎందుకని సిలువపైన ఉన్న దొంగకి శిష్యులకంటే గొప్ప విశ్వాసం ఉంది?

 

ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో సిలువపైన దొంగకి ఉన్న విశ్వాసంలోని అద్భుతమైన కోణాన్ని ధ్యానిద్దాం!

మనం సిలువపై దొంగ గురించి చర్చించేటప్పుడు ఎక్కువ 'మరణపడక పై నిజాయితీగా మారిన' వ్యక్తిగా చూస్తూంటాము. ఎందుకంటే అతను చాలా స్పష్టంగా యేసును, దేవుని రాజ్యాన్ని నమ్మి తన పాపాన్ని ఒప్పుకొన్నాడు (లూకా 23:39-42).

కాని ఈమధ్య ఆ దొంగలో ఉన్న అద్భుతమైన విశ్వాసాన్ని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. దీనిని ఈ విధంగా వివరించడానికి ఇష్టపడుతున్నాను :

యేసును బంధించినప్పుడు, శిష్యులలో చాలా మంది ఆయన్ని ఒంటరిగా వదిలేసి పారిపోయారు (మార్కు 14:50).

పేతురు ఆయన ఎవరో తెలీదని తిరస్కరించాడు (మత్తయి 26:69-75).

సిలువ వేసేటప్పుడు అక్కడ ఆడవాళ్లు మొదటి కొంచెం దూరంలో ఉన్నా, తరువాత యోహానుతో కలిసి సిలువకి సమీపంగా వచ్చారు (మార్కు 15:40,41; యోహాను 19:25-27). అయినప్పటికీ యేసు పునరుత్దానుడై తిరిగి లేస్తాడని వారు నమ్మలేకపోయారు (మార్కు 16:3).

పేతురు, యోహానులు ఖాళీ సమాధి దగ్గరకు వచ్చినపుడు, వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే "ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి". (యోహాను 20:9).

మృత్యుంజయుడైన యేసును ఇతరులు చూసారని తెలిసినప్పటికీ, తోమా సందేహపడ్డాడు (యోహాను 20:24-29).

ఎమ్మాయి దారిలో ఉన్న ఇద్దరు శిష్యులు కలవరపడ్డారు (లూకా 24:13-35).

ఆయన ఆరోహణమయ్యే సమయంలో కూడా కొందరు శిష్యులు సందేహపడ్డారు (మత్తయి 28:16-29).

యేసుతో నడిచిన వారికే ఆయన అసహజమైన పునరుద్థానాన్ని నమ్మడం ఎంతో కఠినంగా అనిపించింది.

కాని సిలువపై ఉన్న దొంగ, మరణమవుతున్న యేసును, ఒక మోసగాడిగా అందరిచేత వెక్కిరించబడుతూ ఉన్న ఆ యేసును చూసి, పునరుద్థానాన్ని పొందకముందే ఆయన్ని విశ్వాసించాడు.

అది అద్భుతమైన విశ్వాసం అంటే!!

ఈ ప్రపంచం అంతా మన ప్రభువును వెక్కిరించినా, పరిస్థితులు నిరీక్షణకు ఆధారం లేనివిగా అనిపించినా, మనం కూడా అలాంటి అద్భుతమైన విశ్వాసం చూపి యేసును మహిమపరుద్దామా! అలాంటి విశ్వాసం ప్రభువు మనందరికి దయచేయును గాక!!



ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో సిలువపైన దొంగకి ఉన్న విశ్వాసంలోని అద్భుతమైన కోణాన్ని ధ్యానిద్దాం!




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.