మూడు రకాల మరణాలు

ఎవరైతే రెండుసార్లు మరణిస్తారో వారికి శిక్ష అని దేవుని వాక్యం చెబుతుంది. మూడు సార్లు మరణించడం అంటే ఏంటో నీకు తెలుసా? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.



• రెండుసార్లు మరణించేవారికి శిక్ష.


• మూడుసార్లు మరణించేవారికి రక్షణ.

మూడు విధాలుగా ఒక వ్యక్తి మరణం ఉంటుంది :

1. పాపంలో మరణం - మనమందరం ఈ స్థితిలో జన్మించాం (ఎఫెస్సీయులకు 2::1-2).

2. శరీరంలో మరణం - మనందరికీ ఈ ముగింపు నిర్దేశించబడింది (హెబ్రీయులకు 9:27) (1)

3. పాపానికి మరణించడం - మనమందరం ఈ స్థితి కొరకు రక్షించబడ్డాం. క్రైస్తవులం అయిన మనందరం పాత స్వభావాన్ని చంపుతూ, కొత్త స్వభావానికి జీవానిచ్చే ప్రక్రియలో ఉన్నాం (రో్మీయులకు 6:1-14).

దేవుని యొక్క న్యాయమైన తీర్పు కొరకు ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు, ఎవరైతే క్రీస్తుతో మరణిస్తారో వారే క్రీస్తుతో లేపబడతారు (రో్మీయులకు 6:8).

అంతేకాకుండా, ఎవరైతే ఎంత తీవ్రంగా ఈ భూమిపై క్రీస్తు మరణాన్ని అనుభవిస్తారో, అంతే తీవ్రంగా ఈ భూమిపై క్రీస్తు జీవాన్ని అనుభవిస్తారు మరియు పరలోకంలో వారు పొందబోయే ప్రతిఫలం చాలా గొప్పది.

సత్యమేమితంటే, ప్రతీ యాదార్థమైన విశ్వాసి "మరణించడం నేర్చుకుంటూనే ఉంటారు". (లూకా 9:23-24).

పూర్తిగా క్షమించుట ద్వారా, ఎక్కువ త్యాగంతో ప్రేమించుట ద్వారా, ఎక్కువ తగ్గింపుతో నడుచుట ద్వారా, ఎక్కువ అంకితభావంతో లోబడుట ద్వారా, ఎక్కువ ఉద్దేశపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా, ఎక్కువ విశ్వాస్యతతో దేవుని చిత్తాలను నెరవేర్చుట ద్వారా, మన పాత స్వభావాన్ని ఆత్రుతతో వేటాడి మరణానికి అప్పజెప్పుదాం (ఎఫెస్సీయులకు 4:22-24).

క్రీస్తుతో మరణ అనుభవం మనకు జీవాన్నిస్తుంది (ఫిలిప్పీయులకు 3:10)
--------------------

నోట్ :

(1) యేసు రెండవ రాకడకు మనం సజీవంగా ఉంటే తప్ప.


ఎవరైతే రెండుసార్లు మరణిస్తారో వారికి శిక్ష అని దేవుని వాక్యం చెబుతుంది. మూడు సార్లు మరణించడం అంటే ఏంటో నీకు తెలుసా? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.