ప్రతికూలతలో సౌందర్యం

మనం అనేకసార్లు దీనిని తప్పుగా అనుకుంటాం. క్రైస్తవులు ప్రతికూలతలను ఎందుకు ఎదుర్కోవాలో అర్ధంచేసుకోవడం చాలా ప్రాముఖ్యం.


క్రీస్తు వచ్చేవరకు, ప్రతీ క్రైస్తవుడు పరీక్షగుండా వెళ్లాల్సిందే. పరీక్షంపబడని విశ్వాసి విశ్వాసనీయత పొందలేడు. - వారన్ వెయిర్సబ్


క్రైస్తవ జీవితం అంటే శ్రమలు లేని సుఖమైన జీవితం అని సాధారణంగా మనం అనుకుంటాం. "మనం" అని అంటున్నానంటే, నేను నా గురించే మాట్లాడుతున్నాను.


దేవుడు సుఖ ప్రయాణాన్నేమీ వాగ్దానం చేయలేదని నాకు తెలుసు (యోహాను 16:33); కాని ఎపుడైతే ప్రతీకూలత నన్ను దాడి చేసిందో, కొన్నిసార్లు నేను అయోమయం అయిపోయి, క్రుంగుదలతో తప్పు ప్రశ్నలు అడుగుతూ ఉంటాను.


దీనికి కారణం ఏమిటంటే ప్రతికూలత నా క్రైస్తవ జీవిత ఎదుగుదలకు చాలా మంచిది, అవసరమైనది అని నేను మర్చిపోయాననమాట. వాస్తవానికి ప్రతికూలతను బట్టి నేను సంతోషించాలి ఎందుకంటే అది నాలో ఓర్పును కలుగచేస్తుంది గనుక (రో్మీయులకు 5:3).


1 పేతురు 1:3-9 లో విశ్వాసాన్ని శుద్దిచేయాల్సిన బంగారంతో పోల్చిన ఆ సాదృశ్యం అంటే నాకు చాలా ఇష్టం.


శుద్ధిచేయడానికి ఉపయోగించే అగ్ని దాని సౌందర్యాన్ని చెరిపే మలినాలను నాశనం చేస్తుంది. ఎందుకంటే ఆ మలినాలు లోహాల ప్రాథమిక లక్షణాలను తీసివేసి, వాటికి విలువ లేకుండా చేస్తుంది.


శుద్ధపరచబడిన తరువాత దానిని తయారుచేసిన వానికి ఆ నగ ఎంతో మెప్పును తీసుకొస్తుంది, ఎలాగైతే  ఓర్పుతో కూడిన మన విశ్వాసం మన దేవునికి మహిమను తీసుకొస్తుందో అలా.


Beauty From Adversity


మనం అనేకసార్లు దీనిని తప్పుగా అనుకుంటాం. క్రైస్తవులు ప్రతికూలతలను ఎందుకు ఎదుర్కోవాలో అర్ధంచేసుకోవడం చాలా ప్రాముఖ్యం.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.