ఎందుకు మనం 1 పేతురు 5:6-7 కంఠతపెట్టాలి?

మనం ఎందుకు 1 పేతురు 5:6-7 కంఠతపెట్టాలి, ముఖ్యంగా కఠినమైన పరిస్థితుల మధ్య? ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందామా!


నా హృదయాన్ని పగలుగొట్టే, నాకు గొప్ప బాధను, విసుగును, భయాన్ని కలుగజేసే ఎన్నో కష్టాలు నా జీవితంలో కొనసాగుతూనే ఉన్నాయి.


దేవుని సహాయం లేకుండా నాకు నేను అవి సంభాళించుకొని నడువలేను. అవి నా దేవుని యొద్దకు తీసుకెళ్లే అవకాశం ఉన్నందుకు నేనెంతో కృతజ్ఞతలు చెల్లిస్తాను.


కష్టాలలో సమస్యలలో ఎలా నిలబడి కొనసాగాలో 1 పేతురు 5:6-7 మనకు మంచి ఉపదేశాన్నిస్తుంది :

"దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి."


దీనమనస్కులైయుండుట:

మన పరిస్థితులను బట్టి మనం దేవుణ్ణి తీర్పు తీర్చం. మనకున్న జ్ఞానం, గ్రహింపు పరిమితమైనవి (1 కొరింధీయులకు 13:12).


ఆయన బలిష్ఠమైన చేతిక్రింద:

దేవుడు సర్వధికారి, ఆయన మన జీవితంలో జరిగే చెడును మన మంచికొరకు ఉపయోగించగలడని మనం మర్చిపోము (రో్మీయులకు 8:28).


తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు:

మనం మన దేవుని ప్రణాళికలకు ఉద్దేశాలకు లోబడినప్పుడు, మనం విశ్వాసంలో అభివృద్ధి పొందుతాం, నిత్యత్వంలో మనం ధనాన్ని సమకూర్చుకుంటాం (రో్మీయులకు 5:1-5; గలతీయులకు 6:9; యాకోబు 1:2-4; మత్తయి 6:20; 1 కొరింధీయులకు 3:11-15).


మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి:

ఈ ఒక్కటీ అన్నిటిని మార్చివేస్తుంది! కాని దీనిని మనం ఎన్నుకోవాలి : మనం చింతించాలా లేక ప్రార్ధించాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి (ఫిలిప్పీయులకు 4:6).


ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక:

ఈ విశ్వామంతటికీ దేవుడైనవాడు నీ గురించి చింతిస్తున్నాడు, శ్రద్ధగలిగి ఉన్నాడు! ఆయన ప్రేమే అన్నిటి విషయమై మనలను సరైన దృక్పధంలో పెడుతుంది (1 యోహాను 3:1).


Why We Should All Memorize 1 Peter 5:6-7


మనం ఎందుకు 1 పేతురు 5:6-7 కంఠతపెట్టాలి, ముఖ్యంగా కఠినమైన పరిస్థితుల మధ్య? ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందామా!

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.