మట్టి లేక బంగారం?

దేవుని ఇంటిలో మనలో కొందరు మట్టి పాత్రలని, మరి కొందరు బంగారు పాత్రలని 2 తిమోతి 2:20-21 చెబుతుంది. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


నేను కొత్తగా క్రైస్తవురాలిని అయినప్పుడు, చాలా పాశ్చాతాపపడ్డాను. నా జీవితంలో మొట్టమొదటిసారి నా పాపస్వభావం గురించిన అవగాహన నాకు కలిగినప్పుడు, రక్షకుని అవసరం నాకెంత ఉందో నేను గ్రహించగలిగాను.


కాని ఆ అవగాహనను నేను చాలా తరచుగా  పోగొట్టుకుంటాను. అందుకే 2 తిమోతి 2:20-21 వచనాలను నాకు నేనే ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటాను:


"గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయైయుండును."


మీ గురించి నాకు తెలీదు గాని, నేను మాత్రం నా తండ్రి ఇంటిలో ఒక ఘనత నిమిత్తమైన, పవిత్రమైన, ఆయన వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలని ఇష్టపడుతున్నాను.


ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే : పాశ్చాతాపపడటమే మట్టిగా ఉన్న మనలను బంగారంలాగా, పనికిరాని మనలను ఉపయోగపడే పాత్రలుగా మారుస్తుంది.


-------------------------


ముఖ్యగమనిక 

• పాశ్చాతాపం యొక్క అర్ధం : పాశ్చాతాపం అంటే కేవలం పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు. పాపం నుండి తిరగడం. 'పాశ్చాతాపానికి' గ్రీకులో అర్ధం ఏమిటంటే ఒకరి మనస్సు లేక ఉద్దేశం మార్చుకోవడం. దీనినే 2 తిమోతి 2:20,21లో నిర్దారించడం నాకెంతో ఇష్టమైన విషయం. మనం ఎపుడైతే పాశ్చాతాపపడతామో అప్పుడు మనం ఘనహీనమైన ఉద్దేశాల నుండి ఘనమైన ఉద్దేశాలు కలిగిన వారంగా మార్పు చెందుతాం.. దేవుడు మన కొరకు ముందుగా సిద్దపరచిన ఉద్దేశాల వైపుగా పయనిస్తాం (ఎఫెస్సీయులకు 2:10).


Clay or Gold?


దేవుని ఇంటిలో మనలో కొందరు మట్టి పాత్రలని, మరి కొందరు బంగారు పాత్రలని 2 తిమోతి 2:20-21 చెబుతుంది. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.