తేనెపట్టును తిందాం!

ఎందుకు దేవుని వాక్యాన్ని తేనెతో పోల్చడం సరైన పోలిక, ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది! 💜


చిన్నగా పసుపు రంగులో ఉండే తేనేటీగలు, పువ్వులు, పుప్పొడి, తేనెపెట్టె, రాణులు, పనివారు... తేనె తయారవ్వడానికి జరిగే అద్భుతమైన ప్రక్రియ గురించి ఎపుడైనా ఆలోచించావా?


ఎంతో సంక్లిష్టత, సౌందర్యం అన్నిటిలో అల్లిన ఒక గొప్ప సృష్టికర్తను - రూపకర్తను మనం సేవిస్తున్నాము.


వాటిలో తేనె సామాన్యమైనదేమీ కాదు. అది పంచదారకంటే తీయనిది మాత్రమే కాదు, దానిలో విటమిన్లు, ఖనిజాలు, ఏంటి ఆక్సిడంట్స్ వంటివి కూడా ఉన్నాయి.


అందాన్ని పెంచే ఎన్నో ఉత్పత్తుల్లో కూడా తేనెను ఉపయోగిస్తారు, ఎందుకంటే దీనిలో సహజంగా హ్యూమక్టంట్ ఉంటుంది. ఇది చార్మానికి మంచిది. అంతేకాదు, జలుబు, దగ్గుకు కూడా చాలా శక్తివంతముగా పనిచేస్తుంది.


అది సహజమైనది, స్వస్థతనిచ్చేది, పుష్టికరమైనది, తీయనిది, మధురమైనది, సౌందర్యాన్నిచ్చేది... దేవుని వాక్యాన్ని వివరించే ఒక గొప్ప సాదృశ్యంగా ఉంది :


యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను* మధురమైనవి. (కీర్తనలు 19:9,10)


మన సృష్టికర్త ఎంతటి అద్భుతమైనవాడో ధ్యానిస్తూ ఆయన్ని స్తుతుంచుటకు, ఆయన వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూచుటకు ఈరోజు కొంత సమయం తీసుకుందామా!


-------------------------------


* తీనె యొక్క సహజమైన తీయని రుచిని పొందాలంటే, తిన్నగా తేనెటీగలు తీనెను తయారు చేసిన తేనెపట్టులో నుండే దొరుకుతుంది.


Eat the Comb



ఎందుకు దేవుని వాక్యాన్ని తేనెతో పోల్చడం సరైన పోలిక, ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది! 💜


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.