మాటల యొక్క శక్తి, పరిమితి

సామెతలు 18:21 ను తప్పుగా అర్ధం చేసుకొని ఒక అబద్ద బోధ సంఘాల్లో తయారైంది. ఈరోజు వాక్యధ్యానం దీని గురించే వివరిస్తుంది!



సామెతలు 18:21 వాక్యాన్ని ఆధారం చేసుకోని, మన మాటలు శారీరానికి ఆరోగ్యాన్ని లేక మరణాన్ని కలుగజేస్తాయి అనే వాదనను ఒకసారి పరీక్షించి నా అభిప్రాయం చెప్పమని ఒక స్నేహితురాలు నన్ను అడిగింది.



జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు (సామెతలు 18:21)


• దానికి జవాబు పెద్ద కష్టమేమి కాదు :


ఈ వచనం అబద్ద సాక్షానికి వర్తిస్తుంది కాని ఆరోగ్యానికి కాదు అనే ప్రతిపాదనకు బైబిల్ పండితులు అంగీకరిస్తారు. (1)


అంతేకాదు, సామెతలలో ఉన్న వాక్యాలు బైబిల్ లో ఇంకెక్కడైనా మళ్ళీ వ్రాయబడి ఉంటే తప్ప వాటిని వాగ్దానాలుగా అనుకోకూడదు, మనుషుల మాటలకు ఆరోగ్యాన్ని లేక అనారోగ్యాన్ని, జీవాన్ని లేక మరణాన్ని తెచ్చే అంత శక్తి ఉన్నట్టు వాక్యంలో ఇంకెక్కడా లేదు.


ఇంకా చెప్పాలంటే, యాకోబు గ్రంధంలో 18 వచనాలు నాలుకకు ఉన్న శక్తికి కేటాయించినా, నాలుక ద్వారా శారీరిక ఆరోగ్యము లేక అనారోగ్యము, జీవము లేక మరణము అనే సంభోదనే అక్కడ మనం చూడము. అబద్ద బోధకులు చెప్తున్నట్టు ఒకవేళ మన నోటి మాటలే గనుక మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అనేది వాస్తవమే అయితే, ఇంకా బైబిల్ లో అనేక చోట్ల కూడా అది వ్రాయబడి ఉండేది (3).


ఇతరుల స్వస్థత గురించి మనం తప్పక ప్రార్ధించవచ్చు, దేవుని చిత్తమైతే వారు స్వస్థత పొందుతారు. కాని మన మాటలు కాదు వారు స్వస్థత పొందడానికి కారణం. అది దేవుని శక్తి, ఆయన సంకల్పం.


దేవుని శక్తిని, ఆయన సంకల్పాలను మన మాటల ద్వారా మనం నియంత్రించవచ్చు అని అనుకుంటే మాత్రం మనం చాలా పోరబడ్డట్టే.


నిజమే, మాటలు చాలా శక్తిమంతమైనవి. వాటిద్వారా ప్రేమను, ద్వేషాన్ని, కనికరాన్ని, ఇతరులకు అన్యాయపు తీర్పును, సత్యాన్ని లేక అసత్యాన్ని మనం వ్యక్తం చేయవచ్చు. మాటలు ఇతరులను ప్రోత్సాహిస్తాయి లేక నిరుత్సాహపరుస్తాయి. కాని మనుషుల మాటలు ఆరోగ్యాన్ని లేక అనారోగ్యాన్ని, జీవాన్ని లేక మరణాన్ని తీసుకొస్తాయి అనే నమ్మకాన్ని వాక్యం ఎక్కడా కూడా సమర్ధించలేదు.


~ నిజానికి దేవునికి మాత్రమే ఆ శక్తి ఉందని ద్వితియోపదేశకాండము 32:39 లో వ్రాయబడి ఉంది.


-------------------


(1) అబద్ద సాక్ష్యం ద్వారా ఒక నిర్దోషికి మరణ శిక్ష విధంచవచ్చు లేక ఒక దోషిని విడుదల చేయవచ్చు.


(2) ఒకవేళ సామెతలను వాగ్దానాలుగా నమ్మాలంటే, చెడ్డ వారు త్వరగా చనిపోతారు, వారికి ఉన్నదంతా పోగుట్టుకుంటారు అని , మంచివారు ఎక్కువ కాలం బ్రతికి ధనవంతులుగా చనిపోతారు అనే తప్పుడు అభిప్రాయాల్ని నమ్మాల్సి వస్తుంది.

(3) అబద్ద బోధకులు ఈ వాదనకు వాక్యంలో చాలా ఆధారాలు ఉన్నాయని చెప్తారు గాని, వారు ఉపయోగించే వాటిల్లో ఏదీ వారి వాదనకు సూటిగా సరిపోయేది కాదు.


The Power and the Limit of Words


సామెతలు 18:21 ను తప్పుగా అర్ధం చేసుకొని ఒక అబద్ద బోధ సంఘాల్లో తయారైంది. ఈరోజు వాక్యధ్యానం దీని గురించే వివరిస్తుంది!




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.