"సందర్భానుశారమైన నైతిక విలువలు" అంటే సరైన అర్ధం ఏమిటి?

ఈరోజు వాక్యధ్యానంలో సందర్భనుశారమైన నైతిక విలువల యొక్క ప్రమాదం గురించి తెలుసుకుందాం.



"సందర్భానుశారమైన నైతిక విలువలు" అంటే ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించేది మన సందర్భం పై ఆధారపడి ఉంటుందని, అవి స్థిరమైనవి కాదని నమ్మడం.


అనైతిక అలవాట్లను సమర్ధించుకోవడం రక్షణ లేని ప్రజలలో ఒక అలవాటుగా ఉంటే, క్రైస్తవులం అని చెప్పుకునే వారిలో పాపాన్ని సమర్ధించుకోవడం చాలా సాధారణం అయిపోయింది. మీరు అడగొచ్చు "రెండూ ఒకటి కాదా?" అని. కానే కాదు. ఎందుకంటే కొన్ని వాటికి చట్టపరంగా అనుమతి ఉన్నా, అవి దేవుని ఆజ్ఞలను అతిక్రమించేవిగా ఉంటాయి.


కలిసి సహజీవనం చేయడం, అబోర్షన్, నువ్వు వాహనం నడపనంతవరకు ఎంతైనా త్రాగు అనేవి ఇప్పుడు అనేకచోట్ల చట్టపరమైనవైపోయాయి. ఇలా చట్టపరమైన పాపాల లిస్ట్ చాలా పొడవుగానే ఉంది.


రో్మీయులకు 1:18-21 లో వర్ణించిన సమాజంలాగే మన నేటి సమాజం కూడా ఉంది, అదేమిటంటే అందరూ ఎటుపోతే అటే వెళ్లిపోవడం.


క్రైస్తవులను కాదు, అత్యధిక మెజారిటీ అభిప్రాయాన్ని కూడా కాదు (యెషయా 5:20), దేవుడినే మనం నమ్ముతాం. సరైనది చేయడం సులభం కాదని మనకి తెలుసు (యోహాను 16:33). అయినప్పటికీ మన ప్రభువునే సంతోషపెట్టాలనేది మన నిర్ణయం (1 పేతురు 3:14, మత్తయి 5:10, యాకోబు 1:12).


క్రైస్తవులు ఏది చట్టమో దాని చేత లేక అత్యధిక మెజారిటీ చేత పరిపాలించబడరు. మనం దేవుని ఆత్మ చేత, ఆయన వాక్యం చేత పరిపాలించబడతాము, ఎందుకంటే మనకి తెలుసు దేవుని ఆజ్ఞలు ఆయన ప్రేమలోనుండి పుట్టినవని.


• సులువుగా ఉన్నప్పుడే మనం దేవుని ఆజ్ఞలకు విధేయత చూపేవారమైతే, అసలు సువార్త అంటే మనకు అర్ధంకాలేదన్నమాట (మార్కు 8:34-35).


What Exactly Is "Situational Ethics"?



ఈరోజు వాక్యధ్యానంలో సందర్భనుశారమైన నైతిక విలువల యొక్క ప్రమాదం గురించి తెలుసుకుందాం.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.