మోషే అయిదు సాకులు, ఎందుకు అతను సరిగ్గా వినలేకపోయాడు?

మోషే తాను మంచి మాటనేర్పరిని కాను అన్నాడు, కాని తన అసలు సమస్య, సరిగ్గా వినలేకపోవడం. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


దేవుడు, మోషేని ఫరోతో మాట్లాడమని చెప్పినప్పుడు (నిర్గమకాండము 3, 4లో),


మోషే ఇలా అన్నాడు :
1. నేనెవరిని?
2. నీవెవరు?
3. వాళ్ళు నన్ను నమ్మరు.
4. నేను మంచి మాటనేర్పరిని కాను.
5. నాకు నువ్వు చెప్పిన పని చేయాలని లేదు.


దేవుడు మోషే అహంకారాన్ని శాంతపరచే ప్రయత్నం కాని, తనపై తనకి నమ్మకం పెంచే ప్రయత్నం కాని చేయలేదు. అసలు మోషే గురించి ఏమీ మాట్లాడలేదు గాని దేవుడు తన గురించి, మోషే చేయలేని, తన మాత్రమే చేయగలిగిన తన సామర్ధ్యం గురించి మాత్రమే మాట్లాడాడు.


మోషే ఎవరు అనేది అనవసరం. దేవుడు ఎవరు అనేదే ప్రాముఖ్యం.


నేను ఐగుప్తు ప్రజలు ఆరాధించేలాంటి చిన్న దేవుణ్ణి కాదు, నేను గొప్ప దేవుడను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు. ఐగుప్తు అధికారులకు తనను తాను నిరూపించుకుంటానని, మాట్లాడటానికి మోషేకి మాటలను ఇస్తానని వాగ్దానం చేసాడు.


నేను అనుకుంటాను మోషే తన నాల్గవ సాకును చెప్పినప్పుడు.. మోషే ఇలా అన్నాడు "నేను మాటనేర్పరిని కాదు", అప్పుడు దేవుడు ఇలా ఆలోచించి ఉంటారు "కాదు, నువ్వు సరిగ్గా వినకపోవడమే నీ అసలు సమస్య. నేను నీకు వివరించేది నీ గురించి కాదు, నా గురించి" అని.


మోషే స్వభావం మనలో కూడా చాలామందికి  ఉంది. కాని దేవుడు మనలను ఏమి చేయమని చెప్పినా, ఏ సాకులూ ఆయన ముందు పనికిరావు అనేది స్పష్టం.


Moses' 5 Excuses and Why He Wasn't A Good Listener


మోషే తాను మంచి మాటనేర్పరిని కాను అన్నాడు, కాని తన అసలు సమస్య, సరిగ్గా వినలేకపోవడం. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.