"ఎన్నో సంవత్సరాలుగా ఆమె నాకు తెలుసు, తనంటే నాకెంతో ఇష్టం, కాని ఆమెకు నేనెప్పుడూ యేసు గురించి చెప్పలేదు. ఆమె మరణం నేనసలు ఊహించలేదు" చాలా దుఃఖంతో అంది కన్నీ .
• మరణం ఎక్కువ శాతం ఊహించకుండానే వస్తుంది.
అందుకే దేవుని ప్రేరేపణలు పట్టించుకోని మన చుట్టూ ఉండేవారికి ఉదాహరణకు మన పక్కింటివారికి, స్కూల్లో వారికి, ఇంకా మనకు తెలిసినవారికి దేవుని సువార్త ప్రకటించడం చాలా ప్రాముఖ్యం (ఎఫెస్సీయులకు 5:15-16).
వారిలో కొందరు అన్యమతాల్లో మునిగి ఉన్నవారు ఉండొచ్చు, కొందరు పరలోకంలో తమ స్థానాన్ని తామే సంపాదించుకోగలం అని అనుకునే వారు ఉండొచ్చు, ఇంకొందరు ఈ జీవితం ముగిసాక ఇంకేమి ఉండదు అని అనుకునేవారు ఉండొచ్చు.
రక్షణకు ఒక్కటే మార్గమని వీరికి మనమే చెప్పాలి (1 యోహాను 5:1-12). పరలోకానికి వెళ్ళటం అనేది మన క్రియలవలన సంపాదించగలిగేది కాదు కాని యేసు క్రీస్తు ప్రభువుయందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఉచితంగా ఆయన ఇచ్చే రక్షణ మనం పొందగలం (ఎఫెస్సీయులకు 2:1-10).
కనుక, ఈరోజు, మన మార్గంలో ఉన్నవారికి క్రీస్తును గురించిన సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రేమతో ప్రకటించుటకు సమయోచితమైన జ్ఞానం కొరకు, సహజమైన ధైర్యం కొరకు, దేవుణ్ణి వేడుకుందామా! ఊహించనివి జరిగినప్పుడు కోల్పోయిన అవకాశంగా ఎవ్వరి విషయంలో అటువంటి దుఃఖం మనకు కలుగకుండును గాక!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.