ఒక వ్యక్తి తప్పిపోవడానికి మొదటి కారణం ఏమిటి?

ఒక వ్యక్తి దేవుని నుండి తప్పిపోవడానికి మొదటి కారణం ఏమిటి. వారు మామూలుగా దేవునికి దూరమయ్యారా లేక దేవుణ్ణి కాకుండా పాపాన్ని ఎన్నుకున్నారా?


ఎపుడైతే లోకసంబంధమైనవి విలువైనవిగా భావించడం మొదలుపెడతామో, దేవునిపై ఆసక్తిని, పాపం యొక్క అవగాహనను కోల్పోతాము...


పాత నిబంధనలో ఉన్న రాజులు గురించి చదువుతున్నప్పుడు నాకు ఈ కొటేషన్ దొరికింది :

"వారు దేవునికి దూరమవ్వడం వలన ఆజ్ఞలను అతిక్రమించారు కాని ఆజ్ఞలను అతిక్రమించడం వలన దేవునికి దూరమవ్వలేదు. రాజులు మొదట తమ హృదయాల్లో దేవుని విడనాడారు తరువాత ఆజ్ఞలను పాటించడంలో ఓడిపోయారు. ఎప్పుడైతే దేవునికి మన హృదయ తలుపులను మూసేస్తామో, అప్పుడే ఆయన శక్తి, ఆయన సన్నిధి మనలను విడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది".


మనం ఎప్పుడు దేవుణ్ణి బాధపెడతామో, అప్పుడు మనం పరిశుద్దాత్ముని గద్దింపును, పాశ్చాతాపాన్ని అనుభవిస్తాము. దీనికి కారణం మన హృదయాలు ఇంకా దేవుణ్ణి వెతుకుతున్నాయని అర్ధం.


కాని దేవుని చిత్తాన్ని గ్రహించే ఆ సామర్ధ్యాన్ని మనం ఎప్పుడు కోల్పోతామంటే :


లోకసంబంధమైన ధ్యేయాలపై దృష్టి నిలపడం వలన (1 యోహాను 2:15-17).

• ఇతరులలో ఉన్న తప్పులను ఖండిస్తూ, తమ తప్పులను సమర్ధించుకోవడం వలన (మత్తయి 7:3-5).

• దిద్దుబాటును తిరస్కరించడం వలన (సామెతలు 15:32).


ఒక్కసారి దేవుణ్ణి వెతకడం, సేవించడంలో ఆసక్తిని గనుక కోల్పోతే, నెమ్మదిగా మన పాపాలను మనం గుర్తుపట్టే ఆ సామర్ధ్యాన్ని కూడా కోల్పోతాం (1 తిమోతి 4:1-2).


ఈరోజు కొంత సమయాన్ని తీసుకోని, నీ జీవితంలో ఏ ప్రాంతాల్లోనైనా నిన్ను నీవు దేవునికి దూరం చేసుకున్నావేమో దేవుణ్ణి అడుగు. ఒకవేళ చేసుకొని ఉంటే, పాశ్చాత్తాపపడి, నీ పూర్ణహృదయంతో 💜 దేవుణ్ణి తిరిగి వెతకడం ప్రారంభించు.


What comes first When a Person Strays?


ఒక వ్యక్తి దేవుని నుండి తప్పిపోవడానికి మొదటి కారణం ఏమిటి. వారు మామూలుగా దేవునికి దూరమయ్యారా లేక దేవుణ్ణి కాకుండా పాపాన్ని ఎన్నుకున్నారా?


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.