లోకమునకు వెలుగును గురించి 8 సత్యాలు

లోకమునకు వెలుగును గురించి చెప్పడానికి చాలా ఉంది. కాని ఈరోజు వాక్యధ్యానం దీని గురించి కేవలం 8 సత్యాలనే వివరిస్తుంది!


యోహాను 8:12 లో యేసు "నేను లోకమునకు వెలుగు" అని చెప్పారు. వెలుగు అనేది ఒక అద్భుత సహాయకరమైన రూపకాలంకారం. ప్రతీ ఒక్కరూ దీనిని అర్ధం చేసుకోగలరు. కాని యేసుకు జతైన ఈ పేరుతో వచ్చే అర్ధం రూపకాలంకారంకు మించినది.


✨️ 1. దేవుడు ఈ భూమిపై శారీరిక మరియు ఆత్మీయమైన రెండు వెలుగులూ ఇచ్చారు (ఆదికాండము 1:3-4), కాని పరలోకంలో క్రీస్తు అనే వెలుగు మాత్రమే మనకు అవసరం (ప్రకటన గ్రంధం 21:23).


✨️ 2. దేవుడు మనపై మనలో ప్రకాసిస్తాడు (కీర్తనలు 18:28; 27:1; 36:9; యెషయా 60:1; యోహాను 1:4-5).


✨️ 3. దేవుడు ఈ లోకంలో ఉన్న ఆత్మీయ చీకటిని తొలగించడానికి వెలుగును తెచ్చారు (యెషయా 42:16; మీకా 7:8; మత్తయి 4:16).


✨️ 4. విచారం ఏమిటంటే, చాలా మంది చీకటినే ఇష్టపడతారు (యోహాను 3:19-20).


✨️ 5. క్రీస్తు కోసం ప్రకాశించడానికి క్రైస్తవులే వెలుగుగా మారిపోతారు (మత్తయి 5:14-16; 2 కొరింధీయులకు 4:6; ఫిలిప్పీయులకు 2:14-16; 1 పేతురు 2:9; 1 థెస్సలోనీయులకు 5:5). అన్యులకు వెలుగుగా ఉండటానికి పౌలు పిలువబడ్డాడు (అపో. కార్యములు 13:47; 26:16-18).


✨️ 6. క్రైస్తవులే వెలుగు గనుక వారికి చీకటితో పొత్తు ఉండకూడదు (2 కొరింధీయులకు 6:14; ఎఫెస్సీయులకు 5:6-9).


✨️ 7. వెలుగులో నడిచే మనకు దేవునితో సహవాసం ఉంటుంది గనుక పాపాలు గురించి పాశ్చాతాపపడతాం (1 యోహాను 1:5-9).


✨️ 8. దేవుని వాక్యమే వెలుగు (కీర్తనలు 119:105,130).


అవును! మన దేవుడే వెలుగు, ఆ వెలుగును ఆయన మనతో పంచుకుంటున్నారు!


8 Truths About the Light of the World


లోకమునకు వెలుగును గురించి చెప్పడానికి చాలా ఉంది. కాని ఈరోజు వాక్యధ్యానం దీని గురించి కేవలం 8 సత్యాలనే వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.