ముందు, తరువాత

ఈరోజు వాక్యధ్యానం, రక్షణలో ఉన్న విశ్రాంతి గురించి క్రైస్తవులలో ఉండే సాధారణమైన నమ్మికను ఖండిస్తుంది!


మనం ఎప్పటికీ నీతిమంతులమని చెప్పుకోవడానికి సరిపోము లేదా మన మంచి క్రియలు మనలను రక్షించడానికి సరిపోవు. రక్షణ అనేది ఉచితంగా పొందే బహుమనం (ఎఫెస్సీయులకు 2:8-9).


కాని ఒక్కసారి రక్షింపబడిన తరువాత, మనం మారిపోతాం - మంచి క్రియలు చేయుట, నీతిమంతులుగా జీవించుట అనేవి దేవునితో మన నడకకు ఒక ప్రాముఖ్యమైన గుర్తులుగా మారిపోతాయి.


రక్షణ అనేది మనం పడుకునే ఒక పరుపు కాదు గాని అది నూతన జీవిత విధానానికి ఒక తలుపు వంటిది.


మారాలని, మంచి మార్గంలో నడవాలని, క్రీస్తులాగా జీవించాలనే తీవ్రమైన వాంఛలే యదార్థమైన విశ్వాసానికి గుర్తు, కాని పరిపూర్ణత కాదు.


దీనినే పౌలు ఈ విధంగా వ్యక్తపరిచాడు :


• "ఆయనను ఎరుగు నిమిత్తం... నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను... వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు... క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను". (ఫిలిప్పీయులకు 3:10-14)


మారడానికి, ఎదగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉద్దేశపూర్వకంగా తీసుకోవడమే యదార్థమైన విశ్వాసంలో కీలకమైన విషయం :

• "కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే." (ఫిలిప్పీయులకు 2:12-13)


Before and After


ఈరోజు వాక్యధ్యానం, రక్షణలో ఉన్న విశ్రాంతి గురించి క్రైస్తవులలో ఉండే సాధారణమైన నమ్మికను ఖండిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.