చాలా మంది యొక్క దృష్టి వస్తు సంపద లేక లోకం ఇచ్చే కీర్తి లేక మనుషులు మెచ్చుకోవడం మీదే ఉంటుంది.
కాని నిత్యత్వపు కోణాన్ని కేవలం 20/20 ఆత్మీయ దృష్టి ఉన్న క్రైస్తవులు మాత్రమే చూడగలరు :
1. వారి చూపు ఇహలోక ధనం పైన కాక, శాశ్వతమైన పరలోకపు ధనం పైన ఉంటుంది.
వారు ఆ ధనాన్ని చూసినా "దానిపై దృష్టిని నిలుపరు" ఎందుకంటే శాశ్వతమైన పరలోకపు ధనంతో పోలిస్తే ఇహలోక ధనం చాలా తాత్కాలికమైనదని, అల్పమైనదని వారికి బాగా తెలుసు గనుక (సామెతలు 23:5; 1 తిమోతి 6:6-8, 17-19).
2. వారి చూపు దేవుని సంతోషపెట్టడం పైనే ఉంటుంది గాని, లోకాన్ని కాదు.
దేవుని సేవించడానికి అవసరమైతే మనుషులచేత అవమానించబడటానికి, ద్వేషించబడటానికి కూడా సిద్ధంగా ఉంటారు (మత్తయి 5:11-12; యోహాను 15:18; గలతీయులకు 1:10).
3. వారి చూపు దేవుని ఎక్కువ తెలుసుకోవడం పైనే ఉంటుంది.
దైవ భక్తిని సాధకము చేసుకోవడం ఇప్పటి జీవితానికి, నిత్యత్వానికి కూడా ప్రయోజనకరమని వారికి తెలుసు (1 తిమోతి 4:8; యిర్మీయా 9:23-24).
✝️ 20/20 ఆత్మీయ దృష్టి ఉన్న క్రైస్తవులకు బాగా తెలుసు ఒకవేళ వారి చూపు లోకసంబంధమైన ధనం పైకి వెళ్తే, వారి హృదయాలు కూడా లోకసంబంధమైనవిగా మారిపోతాయని (మత్తయి 6:19-21). అది జరగనివ్వకుండా వారు జాగ్రత్తపడతారు.
✝️ ఈ లోకపు "ముండ్లపొదలు" వారి జీవితంలో
దేవుని వాక్యాన్ని అణచివేసి నిష్ఫలం చేయనీయకుండా వారు జాగ్రత్తపడతారు (మత్తయి 13:22).
నీ కనులు దేనిని చూస్తున్నాయి? ఒకసారి పరీక్షించుకుందామా?
☑️ఈ క్రింది వచనాల సహాయంతో ప్రార్థిదాం :
• భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. (మత్తయి 6:19-21)
• ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. (1 యోహాను 2:15-17)
20/20 Vision: Seeing the Eternal
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.