"నువ్వు పరిసయ్యుడవు" - ఇది ఎవరినైనా అవమానించడానికి ఉపయోగించే ఒక ప్రసిద్ధిమైన మాటగా మారిపోయింది.
ఎవరైతే అంతగా ప్రసిద్ధి కాని దేవుని ఆజ్ఞలను సరిగ్గా సంభోదిస్తారో లేక అబద్ద బోధకులు వాక్యంలో బోధించే తప్పులను ఎత్తి చూపుతారో లేక 'క్రైస్తవ' పుస్తకాలలో మరియు వేడుకలలో ఉన్న తప్పులను ఎత్తి చూపుతారో అలాంటివారికి అపకీర్తి తేవాలని ఈ ప్రసిద్ధమైన మాటను ఉపయోగిస్తారు.
అసలు పరిసయ్యులు అంటే ఎవరో మాట్లాడుకుందాం. పరిసయ్యులు చేయని దానిని మనం చేద్దాం - రండి! దేవుని వాక్యంలో నుండి జవాబును కనుగొందాం.
మత్తయి 23:13-32 లో పరిసయ్యులను ఏడు రకాలుగా శపిస్తూ, వారి చెడు స్వభావాన్ని యేసు వర్ణించడం చూస్తాం. వారు మెస్సియాను తృణీకరించడం మాత్రమే కాదు, ఇతరులను ఆయన నుండి దూరంచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
• వారికి ఇహలోక భూసంబంధమైన వస్తువులు లేక విషయాలు అంటే ఎంతో ఆశ, వారి ఆశలకు అనుగుణంగా ఉండేలా దేవుని ఆజ్ఞలను కూడా మార్చడానికి వెనకాడరు (మత్తయి 15:1-9).
• వారు దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు. న్యాయము, కనికరము, విశ్వాసము వంటి ముఖ్యమైనవి అశ్రద్ధ చేసి, దశమ భాగాలు, ఆచారాలలో అమితాశక్తి చూపుతారు.
• వారు పైకి మాత్రమే భక్తిగలవారుగా ఉంటారు. ఎందుకంటే వారు దేవుని ఆమోదం కంటే మనుషుల పొగడ్తలు కోసం వెతుకుతూ ఉంటారు (మత్తయి 23:5-7; 2 తిమోతి 3:1-5). ఎంతో అక్రమాన్ని కలిగి ఉండి కూడా, ఇతరులను త్వరగా నిందించడానికి ఇష్టపడతారు.
• ఆత్మసంబంధమైన లోపాలు గురించి అస్సలు పట్టించుకోరు. మనుషుల చేత చేయబడిన శాసనాలను, సంప్రదాయలను మాత్రమే పట్టించుకుంటారు (మార్కు 7:8-9).
మనుషుల చేత వ్రాయబడిన లేక సృష్టించబడిన వాటిల్లో వాక్యానుసారమైన లోపాలు ఉన్నాయని నువ్వు చెప్పడం వల్ల ఎవరో నిన్ను "పరిసయ్యుడు" అని పిలిస్తున్నారేమో, కాని అలా పిలిచే వారే పరిసయ్యుల లాగా ప్రవర్తిస్తున్నారని గమనించాలి.
"నీవే పరిసయ్యుడు" అని వారిని తిరిగి అనొద్దు అని నా సలహా. పేరులు పెట్టి పిలవడం పరిసయ్యులు చేసే పని కాని, అది పరిపూర్ణ క్రైస్తవుల పని కాదు (మత్తయి 9:34; 10:25).
A One-Liner Pharisees Love Using: "You're a Pharisee"
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.