మన ఆత్మలకు కూడా వర్తించే శుభ్రపరచు సూత్రం

శుభ్రపరచే చిట్కా ఒకటి అమ్మ నాకు నేర్పింది. అది మన ఆత్మీయ జీవితానికి కూడా వర్తించే ఒక గొప్ప సూత్రం!


శుభ్రం చేయడానికి మా అమ్మ ఒక మంచి చిట్కా నేర్పింది :  మురుకి చిన్న చిన్నగా ఉన్నప్పుడే శుభ్రం చేసుకుంటే అవి పెద్దవి అవ్వవు అని.


నేను బేకింగ్ చేసే ముందు, దానికి సంబంధించిన పదార్ధాలు పక్కన పెట్టి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటాను. అల్మారాలు, అరలు సంవత్సరంలో అనేకసార్లు శుభ్రపరచడమంటే నాకు చాలా ఇష్టం. మురికి పేరుకుపోకుండా ఉండాలని బాత్రూం తరుచూ శుభ్రం చేసుకుంటాను.


మురికి పెద్దగా అవ్వక ముందు చిన్నగా ఉన్నప్పుడే శుభ్రం చేసేసుకుంటాను.


ఇదే చిట్కా ఆత్మీయ జీవితానికి కూడా వర్తిస్తుంది :


• శుభ్రత లేని ఆలోచనలు, నిరాశ నిస్పృహలతో చిందరవందరగా నిండిపోయే గదులను సృష్టిస్తుంది.


• చిన్నగా నేలమీద కారే చేదు, అతుక్కునే కోపానికి, అసహ్యానికి, కుళ్ళుకు దారితీస్తుంది.


• అవినీతి అనే చిన్న చిన్న కుప్పలు మన అల్మారాలను తనను తానే మోసగించుకునే స్థితితో నింపేస్తుంది.


కాని పాపం చిన్నిగా ఉన్నపుడే శుభ్రం చేసుకుంటే, అవి పెద్దవి కాకుండా మనం నిరోధించగలం.


లూకా 16:10 దేవుని సేవలో నమ్మకత్వాన్ని ప్రోత్సాహించడానికి ఉపయోగించినా, అది పాపానికి కూడా వర్తిస్తుందని నా అభిప్రాయం.. చిన్న పాపాలను వ్యవహరించే విషయంలో నమ్మకంగా ఉంటే, పెద్దవాటిలో కూడా నమ్మకంగా ఉంటాం. బహుశా చిన్నగా ఉన్నప్పుడే వాటిని సరిదిద్దుకుంటే, అవి పెద్దగా అవ్వకుండా ఆపగలం.


చిన్న విషయాలు ముఖ్యమైనవి.


శుభ్రపరచే కొన్ని చిట్కాలు :


1. ఈ లోకానుశారమైన విలువలు నిన్ను తన వైపుకు లాగడం ప్రారంభించినపుడు :


దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. (యాకోబు 4:8)


2. పాపం చేయాలని శోధించబడుతున్నపుడు, నీ నిరీక్షణ క్రీస్తులో ఉందని జ్ఞాపకం తెచ్చుకో :


ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును. (1 యోహాను 3:3)


A Cleaning Principle that Applies to Our Spirits


శుభ్రపరచే చిట్కా ఒకటి అమ్మ నాకు నేర్పింది. అది మన ఆత్మీయ జీవితానికి కూడా వర్తించే ఒక గొప్ప సూత్రం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.