దీనికంటే కేంద్రమైనది ఏదీ లేదు


చరిత్రలో కేంద్రబిందువు మన జీవితాలకు కూడా కేంద్రబిందువని నీకు తెలుసా? అది తెలుసుకోవడం నీకు ఆశీర్వాదకరం!


యేసు క్రీస్తు యొక్క సిలువ కంటే మన జీవితాలకు ఏదీ కేంద్రం కాదు!


క్రాస్ (సిలువ) అనే పదం క్రక్స్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్ధం ఏమిటంటే కీలకమైనది అని లేక ముఖ్యమైన కేంద్రం అని అర్ధం.


సిలువ కంటే కేంద్రమైనది, కఠినమైనది, కీలకమైనది మన జీవితానికి గాని మన మరణానికి గాని మరొకటి లేదు.


మనం క్రైస్తవులంగా మార్పుచెందినప్పుడు, క్రీస్తు సిలువ వద్ద తల వంచి మన పాపాలను ఒప్పుకుంటూ, ఆయన రక్షణను అంగీకరిస్తాము.


కాని రక్షణ యొక్క ప్రాముఖ్యత అక్కడితో ముగియదు గాని అప్పుడే మొదలవుతుంది.


యేసు సిలువ దగ్గర వంచిన తల ఎత్తి నిలుచున్నపుడు, ఇంక మనం ప్రేక్షకులంగా ఉండటం మానేసి, సిలువను మోసేవారంగా మారుతాం.


మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. (లూకా 9:23,24)


యేసు సిలువ చరిత్రలో మాత్రమే కేంద్రబిందువు కాదు గాని, ప్రతీ విశ్వాసి జీవితంలో కూడా కేంద్రబిందువే.


Nothing Could Be More Central


చరిత్రలో కేంద్రబిందువు మన జీవితాలకు కూడా కేంద్రబిందువని నీకు తెలుసా? అది తెలుసుకోవడం నీకు ఆశీర్వాదకరం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.