ప్రియ క్రైస్తవుడా, నిన్ను గురించి నువ్వు గొప్పగా ఎంచుకోకు!

మనల్ని గురించి మనం గొప్పగా ఎంచుకోవడం చాలా ప్రమాదకరం. పౌలే మనకు మంచి మాదిరి. దీనినే ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!


క్రైస్తవులముగా మన గురించి మనం గొప్పగా ఎంచుకోవాలా?


అపొస్తులుడైన పౌలు మాదిరిని అనుసరించాలి అనుకుంటే, దీని జవాబు కాదనే చెప్పాలి (1).


పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. (1 తిమోతి 1:15) ~ పౌలు


యేసును వెంబడించే ముందు తాను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న పాపి అని పౌలు గుర్తించాడు, వెంబడించడం మొదలుపెట్టిన తరువాత కూడా పాపం చేసే సామర్ధ్యం ఇంకా తనలో ఉందని కూడా గుర్తించాడు :


కాబట్టి మేలు చేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. (రోమీయులకు 7:21)


నమ్మకంగా ఉండటానికి ఉద్దేశపూర్వకమైన కృషి చాలా అవసరం అని పౌలుకు తెలుసు :


సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. (ఫిలిప్పీయులకు 3:13-14)


ఈ సంగతులు మనందరి విషయంలో కూడా నిజం.


గర్వాన్ని తప్పించుకొని దాని నుండి మనల్ని మనం కాపాడుకోవడం మనందరికీ ఎంతో అవసరం అంతే కాక ఫిలిప్పీయులకు 2:12-13 లో పౌలు చెప్పినట్టు చేయాలి:


కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. (ఫిలిప్పీయులకు 2:12,13)


• నమ్మకస్తులుగా ఉండాలనుకుంటే మనల్ని మనం తగ్గించుకొని చూసుకోవడం చాలా ప్రముఖ్యం (రో్మీయులకు 12:3).


-----------------------------


(1) మంచి మాదిరిని పోలి నడుచుకోవాలని పౌలు తరుచూ క్రైస్తవులను కోరాడు (ఫిలిప్పీయులకు 3:17).


Don't Think The Best of Yourself, Dear Christian


మనల్ని గురించి మనం గొప్పగా ఎంచుకోవడం చాలా ప్రమాదకరం. పౌలే మనకు మంచి మాదిరి. దీనినే ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.