నిజమైన ప్రేమలో 'సమ్మతించకపోవడం' ఉంటుందా?

క్రీస్తును ప్రేమించే వారంగా పరిపూర్ణత సాధించడానికి, ఆరోగ్యకరమైన మనస్సాక్షి కొరకు, అందరిలో సాధారణంగా ఉన్న అభిప్రాయానికి భిన్నంగా, మనకు దేవుని ధ్రువీకరణతో పాటు హెచ్చరికలు కూడా అవసరం!


చాలా మంది క్రైస్తవులు ప్రేమను సమ్మతితో (అంగీకారం), ధ్రువీకరణతో, ప్రశంసతో సమానంగా పరిగణిస్తారు.


అసమ్మతి, గద్దింపు, శిక్ష అనేవి ద్వేషంతో సమానంగా పరిగణిస్తారు.


• ఇది చాలా పెద్ద పొరపాటు (అపార్ధం).


దేవుని ప్రేమ లోపం లేనిది. అందుకే ఆయన ధ్రువీకరించడం, ప్రోత్సాహించడంతో పాటు అసమ్మతి, శిక్షించడం, గద్దించడం, హెచ్చరించడం కూడా చేస్తారు.


మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి. (హెబ్రీయులకు 12:5,6)


నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. (ప్రకటన 3:19) ~ యేసు


తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా తమ పిల్లల్ని సమ్మతించడం, ధ్రువీకరించడం, ప్రశంసించడం చేస్తే, అదే వారి ఆత్మీయ ఎదుగుదలకు పెద్ద అడ్డు అయిపోతుందని గుర్తుంచుకోవాలి.


తల్లిదండ్రులైతే సమ్మతిని అసమ్మతితో, గద్దింపుతో, శిక్షతో సమతుల్యతను పాటిస్తారో, వారి పిల్లలను వారు బాధ్యతకలిగిన, కోరికలను నియంత్రించుకోగలిగిన, దైవ భయం కలిగిన పెద్దవారుగా తీర్చిదిద్దగలరు.


ఏది ఏమైనా తమ ఇష్టాన్నే చెల్లించుకునే పిల్లల్ని దేవుడు వేదకట్లేదు. ఆయన వెదికేది నిజమైన ప్రేమను అర్ధం చేసుకున్న పిల్లల్నే.


ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును (యోహాను 14:23, 24).


Does True Love Include Disapproval?


క్రీస్తును ప్రేమించే వారంగా పరిపూర్ణత సాధించడానికి, ఆరోగ్యకరమైన మనస్సాక్షి కొరకు, అందరిలో సాధారణంగా ఉన్న అభిప్రాయానికి భిన్నంగా, మనకు దేవుని ధ్రువీకరణతో పాటు హెచ్చరికలు కూడా అవసరం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.