'స్త్రీ లోబడాలి' అనే ఆజ్ఞ ఆమెను కించపరచడమా? కానే కాదు!

'వాక్యానుసారమైన లోబడటం' అనేది స్త్రీని తక్కువ చేయడమే, దుర్వినియోగపరచడమే అనే వాదనలు చాలా ప్రఖ్యాతిగాంచినవి. ఈ వాదనలు,  సత్యం నుండి చాలా దూరం తీసుకువెళ్తాయి. దీనిని ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!


లోబడుట అనే ఆజ్ఞ స్త్రీ ని కించపరచడమే, కనుక అది వాక్యానుసారం కాదు అనేది కొందరి వాదన. పురుషాధిక్యం కోసం స్త్రీ కి వ్యతిరేకంగా పన్నాగాలు చేస్తున్నారని చెప్పడానికి వారు చెడు ఉదాహరణలు ఉపయోగిస్తారు!


కాని అది నిజం కాదు. దేవుడు ఈ క్రమాన్ని సృష్టి ఆరంభంలోనే పెట్టాడు (1 తిమోతి 2:11-15). దేశాలు, వ్యాపారాలు, సంస్థలు, సంఘాలు సమర్ధవంతంగా నడిపించబడాలంటే మంచి నాయకత్వం ఎలా అవసరమో, అలాగే ఒక కుటుంబానికి కూడా అవసరమే.


భార్యా భర్తలు ఇద్దరూ సమానమే (గలతీ 3:29), కాని వారి పాత్రలు ఒకటే కాదు.


ఒక భార్య తన సలహాలు, అభిప్రాయాలు, భావాలు, కోరికలు పంచుకోవచ్చు. కాని కుటుంబాన్ని నడిపించాల్సింది, అంతిమ నిర్ణయాలు తీసుకోవాల్సింది భర్తలే (1 కొరింధీ 11:3, ఎఫెస్సీ 5:22-23, 1 పేతురు 3:1-7).


లేఖనాల్లో, కుటుంబ నిర్మాణం, క్రీస్తు-సంఘం సంబంధానికి పోల్చబడింది గనుక, లోబడుట అనేది ఒక 'బానిసత్వం' లేక 'దుర్వినియోగం చేయబడటం' లేక 'లొంగదీసుకువడం' అనే అభిప్రాయానికి చోటు లేదు.


ఎలాగైతే తండ్రి క్రీస్తుకు శిరస్సో, భర్త కూడా భార్యకు శిరస్సు అని 1 కొరింధీ 11:3 లో చెప్పబడింది. ఈ సత్యమే 'లోబడటం అనేది భార్యలను తక్కువ చేయడం కాదని' నిరూపిస్తుంది.


పనిచేసే స్థలాల్లో, బైబిల్ ధ్యాన సమావేశాల్లో, లేక ఏదైనా ఇతర సమావేశాల్లో, నాయకత్వపు హక్కులు గురించి ఎక్కడా ఎవ్వరు పోరాడరు, కాని ఎందుకని సొంత ఇళ్లల్లో వాటికోసం పోరాడతారు?


యేసు క్రీస్తు : దేవుని స్వరూపం కలిగి ఉండి కూడా, తండ్రితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలేదు గాని దాసుని స్వరూపమును ధరించుకొని, తనను తనే రిక్తునిగా చేసుకుంటే (ఫిలిప్పీ 2:5-11), మనం మాత్రం ఎందుకు లోబడటం అనేది తక్కువ స్థాయి అని అనుకోవాలి?


మనలను రక్షించడానికి క్రీస్తు లోబడ్డారు. మరి
ఎందుకు లోబడటం అనేది తక్కువ స్థాయి అని మనం ఆలోచించాలి?


గమనిక : పురుషునికి 'సాటి అయిన సహాయం' అంటే తక్కువ స్థాయి అని స్త్రీ వాదులు వాదిస్తారు. కాని 'సాటి అయిన సహాయం' (ఎజర్) అనే పదం దేవునికి కూడా వాడబడింది. దేవుడు మనకు సహాయకుడు అని. లోబడటం అనేది తక్కువ స్థాయి లేక కించపరిచే మాట కాదని చెప్పడానికి ఇది ఇంకొక నిరూపణ.


Is Submission Degrading to Women? No!


'వాక్యానుసారమైన లోబడటం' అనేది స్త్రీని తక్కువ చేయడమే, దుర్వినియోగపరచడమే అనే వాదనలు చాలా ప్రఖ్యాతిగాంచినవి. ఈ వాదనలు,  సత్యం నుండి చాలా దూరం తీసుకువెళ్తాయి. దీనిని ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.