గడ్డకట్టుకుపోవడాన్ని ఎన్నుకున్నవారు!

మీరు ఈరోజు ప్రోత్సాహించబడాలి అని ఆశపడితే, క్రీస్తు పై తమకున్న విశ్వాసం కోసం గొప్ప త్యాగం చేసిన 40 మంది నిజమైన ఈ కథను చదవండి!


అది రోమా సామ్రాజ్యం, క్రీ. శ. 320:


సామ్రాజ్యం వారి విగ్రహాలను మొక్కాలి అనే ఆదేశాలకు లోబడని నలభై మంది క్రైస్తవ యోధులు.


వారిని బలవంతంగా లోబడేలా చెయ్యాలని, అక్కడ ఉన్న అధికారి, బట్టలు తీయించేసి, చలికి గడ్డకట్టుకుపోయిన నదిపై వారిని నిలబెట్టాడు.


ఆ నదీ తీరం నుండి సైనికులు, మీరు ఈ ఆదేశాలకు లోబడితే, ఇప్పుడే మీకు స్నానం చేయడానికి వెచ్చని నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి అని అరుస్తూనే ఉన్నారు కాని ఈ క్రైస్తవ యోధులు మాత్రం చలిలో అక్కడే నిలబడి గంటల తరబడి దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు.


ఆరోజు మధ్య రాత్రి, ఒక వ్యక్తి మాత్రం పాకుకుంటూ ఈ నదిలో నుండి నదీ తీరానికి వెళ్ళిపోయాడు.


కాని ఒక సైనికుడు మాత్రం యేసు ప్రభుని విశ్వసించి, తన బట్టలు తీయివేసి, ఆ 39 మందితో నదిలోకి వెళ్ళి చేరాడు, అపుడు వారి అసలు సంఖ్య మరలా 40 కి చేరుకుంది.


ఆ తరువాత రోజు ఉదయం  గడ్డకట్టుకుపోయిన ఈ యోధులు మహిమా ప్రవేశం చేశారు.


• మనలో చాలా కొద్దిమందికే క్రీస్తు కోసం చనిపోవడానికి అవకాశం వస్తుంది, కాని క్రీస్తు కోసం జీవించగలమా (రోమా 12:1-2)?


• భయంకరమైన విమర్శలు ఎదుర్కుంటున్నా, ఆ పరిస్థితిలో కూడా మనం సత్యాన్నే  పలుకగలమా (లూకా 9:26)?


• 'బట్టలు లేకుండా గడ్డకట్టుకుపోయిన నది పైన నిలబెట్టబడ్డారు' అని ఇలాంటి హింసింపబడుతున్న క్రైస్తవ యోధులు గురించి విన్నప్పుడు, వారిని ప్రార్ధన అనే దుప్పటితో కప్పగలమా (1 థెస్సలొనిక 5:17)?


• మన సుఖాలను త్యాగం చేసి, అది ఆర్ధిక సాయంగా దేవుని పనికి ఇవ్వగలమా (2 కొరింధీ 9:7)?


The Frozen Chosen


మీరు ఈరోజు ప్రోత్సాహించబడాలి అని ఆశపడితే, క్రీస్తు పై తమకున్న విశ్వాసం కోసం గొప్ప త్యాగం చేసిన 40 మంది నిజమైన ఈ కథను చదవండి!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.