దేవునికి సలహాలు ఇవ్వడం

మనుష్యులమైన మనతో పెద్ద సమస్య... మనకివ్వబడిన పనికి మించి చేయకూడనిది ఏదో అదే చేస్తుంటాము!


"చాలా మందికి దేవునికి సేవచేయాలనే కోరిక ఉంటుంది కాని కేవలం సలహాలు ఇచ్చేవారిగా మాత్రమే"


అయ్యో! ఈ విషయంలో నేనూ కొన్నిసార్లు నేరస్తురాలినే.


కొన్నిసార్లు ప్రార్ధన చేయకుండానే ఎదో ఒక పని మొదలుపెట్టి, అప్పుడు దానిని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్ధిస్తాను. లేక నా ఆలోచనలే దేవుని ప్రణాళికలని అనుకుంటాను. లేక నేను అనుకున్నట్టే దేవుడు ఏదైనా చేయనప్పుడు, కలత చెందుతాను.


కొన్నిసార్లు "నేనే గనుక దేవుడిని అయితే, ఇలా చేసుండే దాన్ని" అని కూడా అనే అంత అహంకారం ఉంది నాలో, ఎదో నా ఆలోచనలు దేవుని ప్రణాళికల కంటే గొప్పవి అన్నట్టు.


దేవునికి నా సలహా అవసరం లేదు, నీ సలహా కూడా అవసరం లేదు. మనకే ఆయన సలహాలు చాలా అవసరం.


అందుకే లేఖనం ఇలా చెబుతుంది :

మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. (యాకోబు 1:5-6)


దేవుడిని అడిగి, విశ్వాసం చూపుదామా!


Advising God!



మనుష్యులమైన మనతో పెద్ద సమస్య... మనకివ్వబడిన పనికి మించి చేయకూడనిది ఏదో అదే చేస్తుంటాము!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.