భూమిపై అందరికంటే జ్ఞానవంతుడు, ఎలా మూర్ఖుడయ్యాడు? ప్రసంగి 2:10-11

సొలొమోను నేర్చుకున్నది మనం కూడా నేర్చుకోని జ్ఞానవంతులం అవుదామా. మరీ సొలొమోను తీసుకున్నంత సమయం కాకుండా ఇంకా త్వరగానే నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం!


✝️ నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును (కీర్తనలు 16:2)


ఈ భూమి మీద అందరికంటే జ్ఞానవంతుడైన సొలొమోను (1 రాజులు 4:30), ధనాన్ని పోగుచేసుకోవడానికి, భార్యలకు, లోకాశలకు తన జీవితాన్ని వ్యర్థంగా ఖర్చుపెట్టాడు (1 రాజులు 11). తన తండ్రి అయిన దావీదు పలికిన పై వచన సత్యాన్ని, సొలొమోను తన వృద్దాప్యంలో గ్రహించాడు.


• ప్రసంగి 2:10-11 లో సొలొమోను తన మూర్ఖత్వాన్ని ఇలా వివరించాడు : "నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. ​అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.


అంత గొప్ప జ్ఞానవివేకాలు ఉన్నప్పటికీ, సొలొమోను లోకాశలకు కోరికలకు లొంగిపోయి, తన జీవితాన్ని, తన రాజ్యాన్ని నాశనం చేసుకున్నాడు.


మన సంతోషానికి దేవుడేమి వ్యతిరేకి కాదు గాని, మన సంతోషం కోసం ఆయన చిత్తాలను త్యాగం చేయడమంటే మాత్రం ఆయనకు అంగీకారం కాదు.


• మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. (ఎఫెసీయులకు 2:10)


కనుక ఈరోజు కొంత సమయం తీసుకొని నీ జీవితంలో నీ ముఖ్యమైన ప్రాధాన్యతలు, ప్రణాళికలు గురించి అలోచించు.


How the Wisest Man on Earth Blew It: Ecclesiastes 2:10-11


సొలొమోను నేర్చుకున్నది మనం కూడా నేర్చుకోని జ్ఞానవంతులం అవుదామా. మరీ సొలొమోను తీసుకున్నంత సమయం కాకుండా ఇంకా త్వరగానే నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం!




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.