చదివేవాళ్ళల్లో మనం కూడా ఉందాం : బైబిల్ చదవడం వలన కలిగే 11 లాభాలు

మెదడు ఎదుగుదలకు చదవడం అనేది అన్ని వయస్సులవారికి ఎంత లాభామో, బైబిల్ చదవడం వలన వచ్చే లాభం అంతకంటే మించినది. 11 లాభాలను ఒకసారి చూడండి!


చదవడం అన్ని వయస్సులవారికి లాభామే అని పరిశోధకులు చెబుతున్న విషయం. దీని వలన పిల్లలు వారి భాషను నేర్చుకుంటారు, మాట్లాడే నైపుణ్యతను పొందుతారు, పెద్దలకైతే అది వాళ్ల మెదడుకి ఒక వ్యాయామం లాగా పని చేస్తుంది. పెద్దల్లో స్పందన తగ్గిపోవడాన్ని అది నిదానింపచేస్తది లేక ఆగిపోకుండ సహాయం చేస్తది. అంతే కాకుండా చదవడం వలన ఇతరులతో సున్నితంగా వ్యవహరించగలుగుతాం.


కాని విచారం ఏమిటంటే, చాలా తక్కువమంది మాత్రమే చదువుతారు.


బైబిల్ చదవడంలో ఉన్న అధిక లాభాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


బైబిల్ చదవడం వలన ఈ క్రింది లాభాలు :
1. పాపం చేయకుండా మనకు సహాయం చేస్తుంది (కీర్తనలు 119:11)
2. మనకు ఓదార్పునిస్తుంది (కీర్తనలు 119:52)
3. మంచి వివేచన, మంచి జ్ఞానం ఇస్తుంది (కీర్తనలు 119:66)
4. త్రోవ విడిచి తిరగకుండా సహాయం చేస్తుంది (కీర్తనలు 119:67)
5. సిగ్గుపడాల్సిన పనులు చేయకుండా ఆపుతుంది (కీర్తనలు 119:80)
6. శ్రమయందు నశించిపోకుండా సహాయం చేస్తుంది (కీర్తనలు 119:92)
7. జ్ఞానము, విశేష జ్ఞానము, తెలివి ఇస్తుంది (కీర్తనలు 119:98-100,130)
8. వివేకంతో నిర్ణయాలు తీసుకునేలాగా సహాయం చేస్తుంది (కీర్తనలు 119:104)
9. దారి చూపుతుంది (కీర్తనలు 119:105)
10. సంతోషాన్నిస్తుంది (కీర్తనలు 119:111,143)
11. ఎంతో నెమ్మదినిస్తుంది (కీర్తనలు 119:165)


కాని విచారమేమిటంటే బైబిల్ని తమ జీవితాలకు కేంద్రముగా పెట్టుకున్నవారు చాలా తక్కువమంది అని పరిశోధనలో తేలింది.


దేవుని అద్భుతమైన వాక్యాన్ని చదివి, ధ్యానించి, ప్రేమించే వారిలో మనం కూడా ఉందామా?


Let's Be Among the Readers: 11 Benefits of Reading God's Word



మెదడు ఎదుగుదలకు చదవడం అనేది అన్ని వయస్సులవారికి ఎంత లాభామో, బైబిల్ చదవడం వలన వచ్చే లాభం అంతకంటే మించినది. 11 లాభాలను ఒకసారి చూడండి!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.