విచారం ఏమిటంటే కొందరు వారి జీవితం సులువైనదిగా వున్నంతవరకు విశ్వాసం అనేది చాలా సులభమైనది అనుకుంటారు. కాని విశ్వాసం అనేది సులువైన జీవితం ద్వారా కట్టబడదు.
దీనికి రాజైన సొలొమోను కంటే మంచి ఉదాహరణ ఇంకోటి లేదు. అతనికి లేనిదంటూ లేదు. పైగా దేవుడు అతను ముందు జీవితంలో చేసిన నిర్ణయాలకు అతన్ని మెచ్చుకున్నాడు కూడా. కాని తరువాత అతనికి దేవుని మీద ఉన్న ప్రేమ అన్య స్త్రీల వైపు, వారి దేవతల వైపు, ఐగుప్తు గుర్రాల వైపు తిరిగిపోయింది (1)
ఇతని ఉదాహరణ మనకు ఒక హెచ్చరికలాంటిది. దేవుని యెడల మన హృదయంలో ఉన్న ప్రేమను, భక్తిని తగ్గించేది ఏదైనా సరే, దాని నుండి మనం తప్పించుకోవాలి.
నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము (సామెతలు 4:23)
మనకి ఎంత ఉంది అనేది ముఖ్యం కాదని, ఉన్న దానిని ఎలా ఉపయోగిస్తున్నాం అనేదే ముఖ్యం అని సొలొమోను నిరూపించాడు (కొలస్సీ 3:23). మన పరుగును మొదలు పెట్టడం కాదు, దానిని ఎలా ముగిస్తాము అనేదే అత్యంత ప్రాముఖ్యం (అపో. కార్యములు 20:23,24)
ఈ లోకంలో ఎవ్వరికీ తెలియని వారైనా, దేవునికి ఉత్తమమైనది ఇచ్చిన వారికి, తీర్పు దినాన దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ధారాళంగా ఇస్తాడు (2 కొరింధీ 5:10).
ప్రియమైన ప్రభువా, మాకున్నవి నీకు పూర్తిగా, నమ్మకంగా ఇచ్చివేయడానికి ఉపయోగించేలాగా సహాయం చేయండి.
-------------------
(1) 1 రాజులు 11:1-11, ద్వితీయోపదేశకాండము 17:16; 1 రాజులు 10:26-28.
How Ease and Privilege Ruined A King
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.