"అది చర్మపు క్యాన్సర్ కాదని నిర్ధారించుకోవాలని ఉంది" అని అన్నాను నేను.
వయస్సు మీరినప్పుడు ముఖం మీద వచ్చే ఆ చిన్న చిన్న కనీ కనిపించని మచ్చలను పరీక్షించాక, చర్మపు నిపుణుడైన వైద్యుడు "అది చర్మపు క్యాన్సర్ కాదు" అన్నాడు. కాని వాటిని ఒక పద్దతి ద్వారా నేను చాలా త్వరగా ముఖం మీద నుండి పీకేయగలను అన్నాడు.
"దాని వలన ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా", ఎందుకంటే నేను రెండు వారాలు ఒక మిషన్ ప్రయాణం కోసం వెళ్ళాలి " అని అడిగాను.
"ఒక రెండు రోజులు అవి కొంచెం గడ్డకట్టినట్టు ఉంటాయి" అని చెప్పాడు.
కనుక, సరే అని చేయించుకున్నాను.
తీవ్రమైన ఉష్ణోగ్రతతో దానిని కాల్చడం వలన అది పెద్ద కురుపుగా మారి అందులో నుండి చీము కారుతూ ఉంది. దానితో రెండు వారాలు చాలా శ్రమపడాల్సి వచ్చింది. పైగా మూడు నెలలు రోజులో చాలా సార్లు దానికి డ్రెస్సింగ్ చేయడం వంటి ఎంతో శ్రద్ధ తీసుకోవలసి వచ్చింది.
దాని వలన పడిన మచ్చ ఇప్పుడు పెద్దగా ఏమి లేదు, కొన్ని రోజుల్లో అది మాసిపోతుంది. కాని జీవితంలో వచ్చే గాయాలు లేక మచ్చలు కొన్నిసార్లు మన జీవితాన్నే మార్చేస్తాయి. కొన్నిసార్లు అవి అనవసరంగా, ఏ హెచ్చరిక లేకుండా యాదృఛికంగా వచ్చినట్టు అనిపించొచ్చు.
ఆ కారణం వల్లే రో్మీయులకు 8:28 లో ఉన్న వాగ్దానాన్ని నేనెంతో ప్రేమిస్తాను... దేవుడు నా జీవితంలో జరిగిన ఎలాంటి గాయాన్నైనా, పొరపాటునైనా, ప్రమాదాన్నైనా మంచికి ఉపయోగించగలడు అనే వాగ్దానం ఆదరణతో కూడిన అనేక వాగ్దానాలలో ఒకటి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.