హృదయంలో నుండి దూసుకుపోయే బాధను, సంతోషాన్ని మరియ యోసేపులు వాగ్దానంగా పొందారు!

ఎందుకు ఒక క్రైస్తవునిగా ఉండటం అంటే గొప్ప బాధను, గొప్ప సంతోషాన్ని అనుభవించడమే. దీని అర్ధం ఏమిటో ఈరోజు వాక్యధ్యానం ద్వారా నేర్చుకుందాం!


మరియ యోసేపులు బాలుడైన యేసును ఆలయంలోనికి తెచ్చినప్పుడు, ఈ క్రింది మాటలు విన్నారు :


"ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు; మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవును... (లూకా 2:25-35)


వారి పసి బాలుడు - వారి రక్షకుడు - తన మార్గం, మాటలు, త్యాగం, తన సొంత ప్రజలే తృణీకరించి, ద్వేషించడానికి, పెరిగి పెద్దవాడు కాబోతున్నాడు.


యేసు మీద ప్రేమ వారి హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోతే వచ్చేంత బాధను తేబోతుంది.


మనం కూడా యేసును ప్రేమించేవారమైతే, మనం కూడా ఎగతాళికి, తిరస్కారానికి, అపవాది దాడికి, కొన్నిసార్లు హృదయంలో నుండి దూసుకుపోయే బాధకు కూడా గురికావాల్సి వస్తుంది.


కాని మరియ యోసేపుల లానే, హృదయంలో నుండి దూసుకుపోయే సంతోషాన్ని కూడా అనుభవిస్తాం.


దేవునికి చోటు లేని ప్రస్తుత సమాజంలో, యేసు కోసం దృఢముగా నిలబడినపుడు ఇది గుర్తుపెట్టుకుందాం :


నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. (మత్తయి 5:11,12)


Mary and Joseph Were Promised Soul-Piercing Pain & Joy


ఎందుకు ఒక క్రైస్తవునిగా ఉండటం అంటే గొప్ప బాధను, గొప్ప సంతోషాన్ని అనుభవించడమే. దీని అర్ధం ఏమిటో ఈరోజు వాక్యధ్యానం ద్వారా నేర్చుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.