దేవుడు, విజయాన్ని మనం కొలిచినట్టుగా కొలవడు !
దేవుడు ఇశ్రాయేలీయులకు వారి పాపాలు గురించి హెచ్చరించమని యెహెఙ్కేలుకు ఆజ్ఞపించాడు (యెహెఙ్కేలు 3), కాని ఆ ప్రజలు చెప్పినా వినరని కూడా ఖచ్చితంగా చెప్పాడు (యెహెఙ్కేలు 3:7).
యెహెఙ్కేలు పరిచర్య యొక్క విజయం, వచ్చిన ఫలితాలను బట్టి నిర్వచించబడలేదు కాని అతని విధేయతను బట్టే అది నిర్వచించబడింది (యెహెఙ్కేలు 3:16-19).
ఒకవేళ యెహెఙ్కేలు దేవుని సత్యాన్ని వారిని చెప్పి హెచ్చరించడంలో ఓడిపోయి ఉంటే, దానికి తనే బాధ్యుడు అయ్యుండేవాడు. వారి రక్తం అతని చేతులమీద ఉండేది.
ఆ ప్రజలు వినరని తెలిసినా దేవుడు చెప్పినట్టు వారిని హెచ్చరించడం యెహెఙ్కేలు చేస్తే అతను నమ్మకస్తుడుగా ఎంచబడతాడు.
మనం కూడా అలాంటి రోజుల్లోనే ఉన్నాం.
ఎంత కృపాసహితంగా చెప్పినా, దేవుని మాటలు వినడానికి చాలా కొద్దిమందుకే ఆసక్తి ఉంది (1).
దేవుని కోసం నిలబడే క్రైస్తవులు తరుచూ వెక్కిరింపబడటం, తృణీకరించబడటం, నిరాకరించబడటం, విమర్శించబడటం వంటివి ఎదుర్కుంటూనే ఉంటారు.
నీవు దేవుని కోసం నమ్మకంగా నిలబడే వ్యక్తివైతే, దయచేసి వెనుకకు ముడుచుకుపోకు (హెబ్రీయులకు 10:39)
ఈ వాగ్దానాన్ని మర్చిపోకు :
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. (మత్తయి 5:11,12)
-------------------
(1) దేవుని సత్యాన్ని కృపాసహితంగా, జ్ఞానంతో, ప్రేమతో పంచుకోవడం చాలా ముఖ్యం!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.