ఎంతో పాపంతో పూర్తిగా నిండిపోయి నాశనానికి దగ్గరలో ఉన్న పట్టణం అది. అందులో డబ్బులు కోసం తన శరీరాన్ని అమ్ముకొంటున్న ఒక స్త్రీ. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితి (యెహోషువ 2 & 6).
రాహాబు అనే ఆ వేశ్యకు అంతా వ్యతిరేక పరిస్థితులే అని ఎప్పుడైనా ఆలోచించావా?
కాని తన ఉనికిని నిరూపించే ఆధారాలు ఇవ్వకుండా దేవుడు ఎవ్వరినీ వదలడు.
యెరికోలో అందరిలాగానే రాహాబు కూడా మంచి చెడుల విచక్షణతోనే పుట్టింది (రో్మీయులకు 2:14,15) అంతే కాదు ప్రకృతిలో దేవుని ఉనికి ఆధారాలు కూడా ఆమెకు తెలుసు (రో్మీయులకు 1:20). దేవుడు మునుపు చేసిన అద్భుతాలు గురించిన జ్ఞానం కూడా ఆమెకు ఉంది (యెహోషువ 2:9-11).
కాని యెరికోలో ఉన్న వారందరికంటే భిన్నంగా ఆమె స్పందించింది.
కనుక దేవుడు ఇద్దరు వేగులవారిని ఆమె తలుపు వద్దకు పంపించాడు. నిజానిజాలు తెలుసుకునే పని మీద వాళ్ళు వెళ్లారు అని ఆ వేగులవారు అనుకున్నారు. కాని ఆ ఒక్క ఆత్మను పట్టుకునే పని మీద వాళ్ళు పంపబడ్డారని వారికి తెలీదు.
ఈ ఒక్క వేశ్యను రక్షించకుండా ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవునికి మనసు లేదు.. దాని గురించే దేవుడు చరిత్రలో పరిస్థితులను మార్చేసాడు.
రక్షణ పొందడానికి ఎటువంటి ఆశలు మిగిలి లేని రక్షింపబడని ఆ ఒక్క వ్యక్తి గురించి నీవు ప్రార్దిస్తున్నావా? రాహాబు కథను జ్ఞాపకం చేసుకొని, ప్రార్ధించడానికి ప్రోత్సాహాన్ని పొందు!
The Prostitute - How God Valued Her Soul
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.