ఆదికాండము 3 లో వ్రాయబడిన ప్రేమకధ, చాలా ఆసక్తికరమైన అంశాన్ని మనకు బయలుపరిచింది. సర్పము దేవుడిని అబద్దికుడని చెప్పినప్పుడు, ఆదాము అవ్వ పక్కనే ఉన్నాడు. కాని, ఆదాము మోసగించబడలేదు. సర్పము లేక అపవాదే అబద్ధమాడుతున్నాడని ఆదాముకు బాగా తెలుసు (1 తిమోతి 2:14).
కాని అవ్వ మీద ప్రేమతో - ఆదాము ఊహకందని కార్యం చేసాడు - తినకూడని పండు తిన్నాడు. ఉద్దేశపూర్వకంగా, మరణాన్ని కలిగించే పాపం చేశాడు.
పెళ్ళైన జంటలకు ఇది కొన్ని ముఖ్యమైన హెచ్చరికలను అందిస్తుంది :
1. భార్యలారా, మీ భర్త ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అవి సరైవేనా కాదా అని తనిఖీ చేయండి.
2. భార్యలారా, మీ భర్తకు మీరంటే ప్రేమే అని, మిమ్మల్ని సంతోషపెట్టాలనే ఉంటుందని గ్రహించండి. మీకు దేవునికి మధ్య ఎంచుకోమనే పరిస్థితిలో ఆయన్ని పెట్టకండి.
3. భర్తలారా, ప్రేమపూర్వకంగానే, ధృడంగా కుటుంబంలో మీ నాయకత్వపు పిలిపును తప్పక నెరవేర్చండి. మీ భార్యను సంతోషపెట్టాలని వాక్యంలో దేవుడు చెప్పిన సిద్ధాంతాలలో రాజీపడిపోకండి.
4. భార్యలూ, భర్తలూ, మీ ప్రభావాన్ని ఇరువురి మంచికి ఉపయోగించండి.
• నీవు మోసగించబడకుండా ఉండేలా దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి కష్టపడు (2 తిమోతి 2:15).
• దేవుని వాక్యంతో సరితూగని లోకానుశారమైన సిద్ధాంతాలకు దూరంగా పారిపో (కొలొస్సీ 2:8).
• జీవితంలో ఉన్న అన్ని పరిధిల్లో దైవభక్తిని పెంపొందించడానికి నీ భార్యకు లేక భర్తకు సున్నితంగా, ప్రేమతో స్ఫూర్తిని అందించు.
ఆదాము అవ్వలు నుండి ఈ పాఠాన్ని నేర్చుకోని, మన వివాహ బంధాలను దేవునికి ఇష్టమైన విధంగా అభివృద్ధి చేసుకుందాం!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.