కొన్నిసార్లు క్షమించడం అంటే మన ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోవడం అనుకుంటాం. కాని అది అసలు క్షమాపణ ద్వారానే తిరిగి పొందుకుంటామనే వాస్తవాన్ని మర్చిపోతాం.
రోన్ అనే వ్యక్తి సహోదరి దెబోరాను కార్లా ఫేయి టుకర్ అనే హౌస్టన్ కు సంబందించిన వ్యక్తి హత్య చేయడం జరిగింది.
దెబోరా - రోన్ చాలా సన్నిహితంగా ఉండేవారు. అందువల్ల ఆమె మరణం రోన్ ను ఎంతో కాలం కోపంతో, క్షమించలేని చేదుతో నిండిపోయేలా చేసింది. ఊహించలేని విధంగా టుకర్ జీవితాన్ని ఎలాగ వర్ణించగలమో, అలాగే రోన్ జీవితం మారిపోయింది. మద్యపానం, మత్తు మందులకు అతడు బానిసగా మారిపోయాడు!
కాని ఒకానొక రోజు రాత్రి రోన్ బైబిల్ చదవడం ప్రారంభించాడు.
యేసు పొందిన క్రూరమైన సిలువ మరణం గురించి చదివి ఎంతో కదిలిపోయాడు. తన జీవితాన్ని యేసుకు సమర్పించాడు.
రోన్ కు తెలుసు తాను పొందిన ఈ నూతన జన్మ, తనను టుకర్ ను క్షమించాల్సిన అవసరంలోనికి నడిపిస్తుందని. కాని అతను కేవలం క్షమించడం మాత్రమే కాదు అంతకుమించి చాలా దూరం వెళ్ళాడు.
కార్లా ఫేయి టుకర్ కు మరణ శిక్ష పడింది. ప్రాణం తీసే మందు ఆమె శరీరంలోనికి ఎక్కించకముందు, రోన్ ఆమె ఉన్న చెరసాలను చాలా తరుచూ సందర్శించేవాడు. అలా చేస్తుండగా కార్లా ఫేయి కూడా క్రైస్తవురాలిగా మారిపోవడం, విశ్వాసంలో బలపడడం జరిగింది.
కార్లాకు తెలుసు ఆమె రోన్ క్షమాపణను పొండటానికి అర్హురాలు కాదని. కాని రోన్ కు దేవునిపై ఉన్న విశ్వాసం అతని శత్రువును క్షమించే శక్తిని ఇవ్వడం మాత్రమే కాదు, ఆమెను క్రీస్తు నందు తన సహోదరిగా స్వీకరించడానికి కూడా సహాయపడింది.
ఈరోజు రో్మీయులకు 12:17-21 చదవడానికి కొంత సమయం తీసుకోమని మిమ్మల్ని ప్రోత్సాహిస్తున్నాను. దేవునికి ఉన్నంత క్షమాపణను ప్రదర్శించిన రోన్ యొక్క విశ్వాసం గురించి ఇది వివరిస్తుంది!
God-Sized Forgiveness: True Story of Faith
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.