కష్టాలు ఒక భాగ్యంగా అనిపించినప్పుడు

తీవ్రమైన కష్టాల మధ్యలో దేవుని శాంతిని అర్ధం చేసుకున్న స్త్రీ జిన్నీ. ఆమె కధ నీకు తప్పక ప్రోత్సాహాన్నిస్తుంది!


• జిన్నీ ప్రియమైన కుమార్తె స్టెఫని తన 20 వ పుట్టినరోజు జరిగిన కొన్నిరోజులకు చనిపోయింది (1).


• 2012 లో జిన్నీ భర్త అయిన స్టీవ్ వెన్నెముకకు జీవితాన్ని స్థంబింపచేసే చాలా పెద్ద ప్రమాదం జరిగింది.


• ఈమధ్యే, జిన్నీ, స్టీవ్ తన బిడ్డలకు మనవళ్లకు ఒక సవాలుతో కూడిన జన్యుపరమైన రుగ్మత ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది.


• ఈ కష్టాలు ఎంతో నియంత్రణను, ఒత్తిడిని, నిరుత్సాహన్ని వాళ్ళ జీవితాలకు తీసుకొచ్చినా, జిన్నీ విశ్వాసంలో మాత్రం ఎటువంటి చెలనాన్ని నేను చూడలేదు.


వాళ్ళ కుటుంబం ఈ జన్యుపరమైన రుగ్మతను మోసుకెళ్లాల్సిందే అని వైద్యులు నిర్ధారించిన వెంటనే, మత్తయి 25:23 ద్వారా జిన్నీ తో దేవుడు మాట్లాడినట్లు ఆమె అనుభవించింది. "అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను" (మత్తయి 25:23)


మనలో చాలామందిమి, కష్టాలు దేవుణ్ణి మహిమ పరిచే అవకాశాలుగా చూడలేం. కాని నా స్నేహితురాలు జిన్నీ మనలాంటి అనేకమందిలో ఒకటి కాదు (2).


జిన్నీ లాంటి వారిని బట్టి దేవునికి నేనెంతో కృతఙ్నరాలిని.


ఆమె తన సాక్ష్యం ద్వారా నా విశ్వాసాన్ని ఎంతో బలపరిచింది. అంతే కాకుండా ఆమె ప్రభువు నుండి స్వయంగా పొందిన అదే ఆదరణతో, నా సమస్యల్లో నన్ను కూడా ఆదరించింది (2 కొరింధీ 1:4).


-----------


(1) స్టెఫని ఆర్టీరియవెనస్ మాల్ఫార్మషన్ అనే మెదడుకు సంబంధించిన వ్యాధి వల్ల ఆకస్మాత్తుగా మరణించింది.

(2) పౌలు లాగ జిన్నీ కూడా తన విశ్వాసం వల్ల శ్రమల్లో దేవుణ్ణి ఇంకా ఎక్కువగా నమ్మగలిగింది (2 తిమోతి 1:12). ఈ కష్టాల వల్ల దేవునిలో ఆమె విశ్వాసం బలాన్ని పొందుతుందని ఆమె అర్ధం చేసుకుంది (యాకోబు 1:2-3).


When Hardship is a Privilege


తీవ్రమైన కష్టాల మధ్యలో దేవుని శాంతిని అర్ధం చేసుకున్న స్త్రీ జిన్నీ. ఆమె కధ నీకు తప్పక ప్రోత్సాహాన్నిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.