వాగ్దాన భూమిని చూడటానికి దేవుడు పన్నెండు మంది నాయకులను పంపారు.
వారిలో పదిమంది వారి భయాలకు మించి చూడలేకపోయారు.. వారు తిరిగి వచ్చి ఇతరులను కూడా కంగారు పెట్టడానికి, నిరాశపరచడానికి ప్రయత్నించారు.
కాలేబు మాత్రమే సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. "మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను." (సంఖ్యాకాండము 13:30)
అయినా ఆ పదిమంది విశ్వాసాన్ని బదులు, భయాన్ని ప్రచారం చేస్తూ, ఆ భూమిలో జనులు బలవంతులు, ఉన్నత దేహులు, వారి ముందు మనం మిడతలు వలే ఉన్నామని చెప్తూ ఉన్నారు (సంఖ్యాకాండము 13:17-33).
ఈ కథను నేను చదివినపుడు వారు మూర్ఖులు కదా అనే ఆలోచన నా మనసులో మెదిలినా, నన్ను నేను అలా ఆలోచించకుండా ఆపుకున్నాను. ఎందుకంటే నేను కూడా విశ్వాసం విషయంలో మిడత వంటి వ్యక్తినే. ఎందుకంటే వారికి దేవుడు ఎలాగైతే కానానును వాగ్దానం చేశారో, అలానే నాకు కూడా శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, బలాన్ని, ఎదుగుదలను వాగ్దానం చేశారు. కాని కొన్నిసార్లు ఆయన వాగ్దానాల కంటే నా భయాలపైనే నేను ఎక్కువ పనిచేస్తూ ఉంటాను.
నేను కూడా కాలేబు మాటలను గుర్తుచేసుకుంటూ ఉండాలి. రోమా 8:37 లో ఇలాంటి మాటే ఉంది. అదేమిటంటే "అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము."
నువ్వు జయించే విశ్వాసిగా జీవిస్తున్నావా లేక మిడతలా జీవిస్తున్నావా?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.