కొన్నిసార్లు, ముఖ్యంగా మన ప్రస్తుత సమాజంలో, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మనలను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, మన విశ్వాసాన్ని తప్పుగా ప్రచారం చేసినప్పుడు, ఒక 'ఆత్మీయ అనాధగా' మనకు మనమే అనిపిస్తాము.
అలాంటప్పుడే 'తండ్రి లేనివారికి ఆయనే తండ్రి' అని మనం గుర్తుచేసుకోవాలి (కీర్తనలు 68:4-5).
ఆయన ఒక తండ్రికి ఉన్న కనికరాన్ని మనకు అందిస్తాడు :
తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారియెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు. (కీర్తనలు 103:13,14)
ఒక ప్రేమించే తండ్రిగా మన దేవుడు మన బలహీనతలు, భయాలు, నిరాశలు అర్ధంచేసుకోగలరు. మన కంటే మనలను ఆయన ఎక్కువగా అర్ధం చేసుకుంటాడు.
ఒక ప్రేమించే తండ్రిగా మన దేవుడు 'మన అనుదిన భారాలను భరించగలడు' (కీర్తనలు 68:19):
నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. (కీర్తనలు 55:22)
మన భారాలు గురించి ఇటువంటి అద్భుతమైన సహాయంతో కూడిన వాక్యాలు ఎన్నో ఉన్నాయి, మత్తయి 11:28,29 ప్రభువు మాటల్లో కూడా ఇటువంటి సహాయం చూడగలం.
ప్రేమగలిగిన ఇతర తండ్రుల వలే, దేవుడు కూడా మనకు నీతియందు శిక్షణ ఇవ్వడం, సరైన మార్గాన్ని బోధించడం, మనం తప్పు చేసినప్పుడు ప్రేమతో గద్ధించడం చేస్తాడు.. ఎందుకంటే తన కుమారుని ఆయన ప్రేమిస్తాడు గనుక (సామెతలు 3:11-12).
ఒక తండ్రిగా మన పై ఆయనకున్న ప్రేమ యొక్క లోతును మనం అర్ధం చేసుకోవాలని ఆయన కోరుతున్నాడు. కనుక ఎపుడైనా ఒక 'ఆత్మీయ అనాధగా' నీకు అనిపించినప్పుడు వెంటనే నీ పరలోకపు తండ్రి కౌగిల్లోకి ఎక్కిపో !
You Never Need to Feel Like a “Spiritual Orphan”!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.