నా వ్యక్తిగత అనుభవంలో, శ్రమలు నాకు :
1. దేవుని స్వభావం ఏమిటో తెలుసుకునే స్పష్టతనిచ్చాయి.
2. నన్ను స్వార్ధం తగ్గించుకునేలా చేసాయి.
3. నన్ను గర్వం తగ్గించుకునేలా చేసాయి.
4. ఆత్మీయంగా, మానసికంగా నన్ను బలపరిచాయి.
5. ఇతరుల సమస్యలకు, బాధలకు సున్నితంగా స్పందించే వ్యక్తిగా నన్ను మార్చాయి.
6. ఎక్కువ కృతజ్ఞత భావం నాలో నింపాయి.
అయినా నేను ఇంకా గర్వంగా, స్వార్ధంగా, ఆత్మీయంగా, మానసికంగా బలహీనంగా, ఇతరుల సమస్యలకు సున్నితత్వంలేని వ్యక్తిగా, కృతజ్ఞతలేని వ్యక్తిగా ఉండొచ్చు. కాని వేరే ఏదీ ఇవ్వనంతగా ఈ శ్రమలు నాకు విశ్వాసంలో పరిపక్వతనిచ్చాయని నేను ఖచ్చితంగా చెప్పగలను.
జరిగిన సంఘటనలవల్ల నా హృదయం పగిలినా, ఆ నొప్పితో కూడిన అనుభవాలు నా ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి గనుక నేను నిజంగా కృతజ్ఞతతో నిండిపోతాను.
"నానా విధములైన శోధనలచేత" మనం శ్రమలు అనుభవించినప్పుడు, మన విశ్వాసం ఈ పరీక్షలకు నిలిచినదైతే, "అది సువర్ణం కంటే విలువైనదని" దేవుడు చెబుతున్నాడు (1 పేతురు 1:6-7).
• కాబట్టి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. (యాకోబు 1:2-4)
హెబ్రీయులకు 12:1-12 చూడండి!
6 Things Suffering Has Taught Me
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.