వాళ్ళు అడిగిందల్లా చేయడం మానేద్దాం!

ఈ చిన్న వాక్యధ్యానం, మనం పిల్లలు అడిగిందల్లా చేయడం మానేసి, వారిని కోరికలను నియంత్రించుకునే వారిగా మార్చడానికి మనం సహాయపడేలాగా ప్రోత్సాహిస్తుంది. ఇందులో కొంత వాక్యం కొంత సలహాలు నీ మేలు కోసం.


పిల్లలు ఏది అడిగితే అది చేస్తే, అది వారిని మొండివారిగా, కృతఙ్ఞతహీనులుగా చేస్తుంది.


• టిమ్మీ బొమ్మలు అమ్మే కొట్టులోకి వెళ్ళినప్పుడు ఒక బొమ్మ కోసం తన శక్తినంతా ఉపయోగించి గట్టిగా అరవడం మొదలు పెట్టగానే తల్లిదండ్రులు తనకి కావాల్సింది కొనేసారు.

తల్లిదండ్రులు పిజ్జా తినడానికి బయటకు వెళ్దాం అనుకుంటే, సుశీ మాత్రం మెక్ డోనాల్డ్స్ లోనే తింటానని పట్టుబడితే, వారు చివరికి అక్కడికే వెళ్తారు.

• బాబీ ని సాధారణమైన చెప్పులు వేసుకొని బయటకు వెళ్ళు అంటే, కొత్త బూట్లు వేసుకుంటానని మారాం చేస్తే తల్లి చివరికి సరే అని ఒప్పుకుంది.

తల్లిదండ్రులు ఒక ఇంటిలో మీటింగ్ కు వెళదామని సిద్దపడి పిల్లలను తీసుకెళ్దాం అనుకుంటే, ఆ ఇంటి ఎజమానురాలు మీటింగ్ జరుగుతుండగా పిల్లలు తన ఇంట్లో పరిగెత్తి అల్లరి చేయడం తనకు ఇష్టం లేదు అనినప్పుడు వారు వెళ్లడం మానేస్తారు.


చాలా క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు చెప్తారు, తల్లిదండ్రులు వారి మాట వింటారు.


తల్లిదండ్రుల్లో చాలా మంది మంచి ఉద్దేశాలు కలిగిన వారే, దైవికమైన వారే. అయినప్పటికీ వారి పిల్లల ప్రవర్తన మామూలుగానే ఉందని, అంగీకారమైనదని, అర్ధంచేసుకోదగినదని అనుకుంటూ వారిని వారే మోసం చేసుకుంటున్నారు.


అసలు వారి పిల్లలను కోరికలను నియంత్రించుకోలేనివారిగా పెంచున్నారని వారు గ్రహించలేకపోతున్నారు. ఇదే రేపు వారిని సువార్తను వ్యతిరేకించే మొండివారిగా తయారు చేస్తుంది.


• ఏ పిల్లోడైతే తనకి ఇష్టమైనదల్లా చేసుకుంటూ పోతాడో, తన కోరికలను నియత్రించుకోవడం అనే గుణాన్ని నేర్చుకోలేడు. కోరిందల్లా తాను దక్కించుకున్నా అదేమీ అతన్ని తృప్తిపరచలేదు. పైగా అది అతన్ని మరింత మొండివాడిగా, కృతఙ్ఞతహీనుడుగా మారుస్తుంది.


అసలు కోరికలను నియంత్రించుకోవడం (ఆశా-నిగ్రహం) అనే గుణం ఒక క్రైస్తవుని జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. అది తెలిపే ఈ క్రింది వచనాలు చదవమని నిన్ను నేను ప్రోత్సాహిస్తున్నాను. నీ పిల్లలు మంచి గుణం అలవర్చుకోవాలంటే, వారికి లేదు/వద్దు అని చెప్పడానికి నీకు సహాయం చేయమని దేవుణ్ణి అడుగు.


గలతీయులకు 5:22-23

2 తిమోతి 3:1-5

2 పేతురు 1:4-7


Let's Quit Giving In


ఈ చిన్న వాక్యధ్యానం, మనం పిల్లలు అడిగిందల్లా చేయడం మానేసి, వారిని కోరికలను నియంత్రించుకునే వారిగా మార్చడానికి మనం సహాయపడేలాగా ప్రోత్సాహిస్తుంది. ఇందులో కొంత వాక్యం కొంత సలహాలు నీ మేలు కోసం.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.