శుభసూచకం, తాయత్తులు, మంత్రాలు, స్పటికాలు, అన్యమతాలకు సంబంధించిన అలంకరణలు... ఇవన్నీ చేస్తే దేవుని రెండవ ఆజ్ఞను మీరినట్టే అని ప్రతీ క్రైస్తవునికి తెలుసు.
పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు. (నిర్గమకాండము 20:4)
కాని "మంచి జీవితం" అనేది కూడా ఒక విగ్రహంగా మనం చేసుకునే అవకాశం ఉంది. మనం దేవుణ్ణి ప్రేమిస్తే, సుఖం, సంతోషకరమైన కుటుంబం, మంచి ఉద్యోగం, మంచి ఆరోగ్యం మొదలైనవి దేవుడు మనకి ఇవ్వడానికి ఋణపడి ఉన్నట్టు అనుకుంటాం. కొన్నిసార్లు సువార్త, ఆనందకరమైన జీవితానికి ఒక దారిగా చెప్పే వారు కూడా లేకపోలేదు. కాని వాస్తవానికి దేవుడు ఆత్మీయ, శాశ్వతమైన మేళ్లనే వాగ్దానం చేశారు గాని, భూసంబంధమైనవి, తాత్కాలికమైనవి కాదు (యోహాను 16:33).
• కొన్నిసార్లు ఏదైనా కఠిన పరిస్థితులు వచ్చినప్పుడు, ఎందుకు దేవుడు నా సమస్యలను తీర్చట్లేదు అని అనుకుంటూ, నేను కూడా "మంచి జీవితం" అనే విగ్రహానికి తలొగ్గుతూ ఉంటాను..
~ యోసేపు (ఆదికాండము 37-50), పౌలు (2 కొరింధీ 6:3-10) వైపు చూసినప్పుడు తిరిగి మరలా సరైన దృక్పధాన్ని పొందుతుంటాను.
మనం నరకానికి వెళ్లాల్సిన వాళ్ళం, తప్పిపోయిన వాళ్ళం, మూర్ఖులం, పాపులం, ఆయన లేకుండా ఒట్టివారం.. కనుకనే క్రీస్తుకు మన జీవితాలను ఇచ్చివేసాం. ఆయన మనకు అంతరంగంలో శాంతిని, సంతోషాన్ని, సమృద్ధి జీవాన్ని ఇస్తాడు (యోహాను 10:10), కాని లోకం చెప్పేటట్టు "మంచి జీవితాన్ని" కాదు.
• నువ్వు ఒకవేళ "మంచి జీవితం" అనేదాన్ని ఒక విగ్రహంగా ఆరాధిస్తుంటే, దేవుని క్షమాపణ మరియు సరైన దృక్పధం కోసం నాతో కలిసి ప్రార్ధిస్తావా?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.