ఆర్పడం అనే మాట మనం ఎక్కువ ఉపయోగించం, కాని అది 1 థెస్సలొనీకయులకు 5:19-22 లో వాడబడిన ముఖ్యమైన క్రియ. "ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి."
"ఆత్మను ఆర్పుట" అంటే అర్ధం చల్లార్చొద్దు, అణచవద్దు లేదా దేవుని ఆత్మను అడ్డుకోవద్దు అని. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ అనే అగ్నిపై నీళ్ళు పోయవద్దు అని.
దేవుని ఆత్మను ఆర్పకుండ ఉండటానికి సహాయపడే నాలుగు క్రియలు :
1. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయవద్దు (1)
• క్రైస్తవులం అని చెప్పుకునే చాలా మంది, అంత ప్రాముఖ్యత లేక ప్రజల మెప్పు పొందని వాక్యభాగాలను నమ్మడానికి తిరస్కరిస్తున్నారు. కాని మనకి తెలుసు ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నదని. (కీర్తనలు 119:89)
2. సమస్తమును పరీక్షించు.
• ఘనులైన బెరియా వారివలే మనం కూడా సమస్తమును లేఖనములలో చెప్పినట్టు ఉన్నాయో లేవో పరీక్షించాలి (అపో. కార్యములు 17:11).
3. మేలైనదానిని చేపట్టు.
• కేవలం వినడానికే పరిమితి కావొద్దు (యాకోబు 1:22).
4. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండు.
• 'హితబోధ' కు తగిన విధంగా లేని బోధలకు దూరంగా ఉండాలి, మరి ముఖ్యంగా ఈ రోజుల్లో. 'ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును'. (2 తిమోతికి 4:3,4)
దేవుని ఆత్మను ఆర్ప వద్దు అనే ఈ క్లుప్తమైన, కాని శక్తివంతమైన ఆజ్ఞను శ్రద్ధతో పాటించడానికి మన వంతు కృషి మనం చేద్దాం !!
-----------------------------
(1) ప్రవచనాలు : 1 కొరింధీయులకు 14 లో చెప్పినదాని ప్రకారం ప్రవచించడం ఒక ఆత్మ వరం, అంతే కాకుండా దేవుని వాక్యం ప్రకటించడం కూడా అని బైబిల్ పండితుల నమ్మకం.
"ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి". (2 పేతురు 1:20, 21)


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.