చరిత్ర మొదలైనప్పటినుండి ఆడవారు, మగవారు ఇద్దరూ దేవుణ్ణి తక్కువంచనా వేసిన వారే.
ఏదేను వనములో, దేవుడు ఒక ప్రత్యేకమైన పండును తినొద్దు, తింటే చనిపోతారు అని ఆదాము అవ్వలను హెచ్చరించారు.
దేవుని హెచ్చరికను అవ్వ తక్కువంచనా వేసింది, మానవ జాతి పతనం మొదలైంది (ఆదికాండము 3:1-6).
దేవుని హెచ్చరికను కయ్యిను తక్కువంచనా వేసాడు, తన తమ్ముని చంపాడు (ఆదికాండము 4:6-8).
రాతి నుండి నీరు గురించిన దేవుని ఆజ్ఞను మోషే తక్కువంచనా వేసాడు (సంఖ్యా 20:21), వ్యభిచారం గురించిన దేవుని ఆజ్ఞను దావీదు తక్కువంచనా వేసాడు (2 సమూయేలు 11:4).. ఇలా ఎన్నో ఉదాహరణలు.
దేవుని ఆజ్ఞలను తక్కువంచనా వేయడం ఎంతో బుద్దిహీనత.
యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు. (యిర్మీయా 32:17)
కొన్నిసార్లు నేను నా సమస్యలను చూసి ఆదరించగలిగే (2 కొరింధీ 1:3-5), మార్గం చూపగలిగే (కీర్తన 32:8), అలానే నా సమస్యలను కూడా నా మేలుకే ఉపయోగించగలిగే (రోమా 8:28) దేవుని సామర్ధ్యాన్ని తక్కువంచనా వేస్తుంటానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను.
కాని, దీనికి భిన్నంగా ఉండాలని ప్రార్ధిస్తాను.
ప్రియ ప్రభువా, నిన్ను తక్కువంచనా వేయడం మేము విడిచిపెట్టాలి, సహాయం చేయండి!
Nothing Is Too Difficult For God!


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.