నీ హృదయాన్నే నమ్ముతున్నావా?

"నీ హృదయాన్ని నమ్ముకో" - ఇది లోకంలో చాలా ప్రాచుర్యం పొందిన నినాదం. కాని ఇది వాక్యానుశారమైనది కాదని ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది.


"నీ హృదయాన్ని నమ్ముకో!"


ఇది లోకంలో చాలా ప్రాచుర్యం పొందిన సామెత, కాని ఇది వాక్యానుశారమైనది కాదు.


హృదయం అన్నింటికంటే మోసకరమైనదని వాక్యం చెబుతుంది (యిర్మీయా 17:9).


మానవ భావోద్వేగాలు, మానవ తర్కం నమ్మదగినవి కావు. అందుకే దేవుని వాక్యం ద్వారా మనసుని మార్చుకుంటే, దేవుని హృదయాన్ని అర్ధం చేసుకోగలం. దేవుని వాక్యం ద్వారా మనసుని మార్చుకున్నప్పుడు, జ్ఞానంతో తీర్పు తీర్చగలం (రోమా 12:1,2).


సంబంధాల్లో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావా? ఉద్యోగం, పిల్లలు, ఇల్లు, డబ్బులు ఆదాచేయడం గురించి నిర్ణయాలు తీసుకోవాలా?


నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గాని, నీ హృదయాన్ని మాత్రం నమ్మకు. దేవుని హృదయాన్నే నమ్ముకో!


• నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. (సామెతలు 3:5,6)


• యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు. ​అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. (యిర్మీయా 9:23,24)


• యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. (సామెతలు 9:10) (సామెతలు 1:7, కీర్తనలు 111:10 కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి)


• దేవుని యెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము. (2 తిమోతికి 2:15)


Trust Your Heart?


"నీ హృదయాన్ని నమ్ముకో" - ఇది లోకంలో చాలా ప్రాచుర్యం పొందిన నినాదం. కాని ఇది వాక్యానుశారమైనది కాదని ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.