సహనం యొక్క పరిణామం

మనలో "వేచి చూసే" సామర్ధ్యాన్ని, టెక్నాలజీ మార్చేసింది. బైబిల్ చెప్పే సహనం యొక్క అవసరత ఈరోజు వాక్యధ్యానంలో!


టెక్నాలజీ నా సహన సామర్ధ్యాన్ని తగ్గించేసిందని ఒప్పుకోక తప్పదు. ఒకవేళ మీరు నిజాయితీపరులైతే, ఇది మీ విషయంలో కూడా నిజం అని మీరు కూడా ఒప్పుకుంటారు.


ఇంటర్నెట్ వాడే వారిలో, ఒక వీడియో డౌన్లోడ్ అవడం 5 సెకండ్స్ పడితే ఆలోపే 25% శాతం మంది దానిని మూసేస్తారు, అదే 10 సెకండ్స్ పడితే సగం కంటే ఎక్కువ మందే దానిని మూసేస్తారు అని ఒక స్టడీ చెబుతుంది.


ఈ అసహనం కేవలం ఇంటర్నెట్ వాడటం పైనే ప్రభావం చూపితే, అది అంత బాధపడాల్సిన అవసరం లేదు. కాని ఇది మన జీవితంలో ఉన్న అన్ని ప్రాంతాలలోకి స్రవిస్తుంది.


మనం తక్కువ చదువుతాం, డబ్బులు ఆదా చేయడం తక్కువ, ఎక్కువ కాలం పట్టే లక్ష్యాలతో కష్టం, ప్రతిఫలం ఆలస్యం అయితే ఇష్టపడం.


కాని విచిత్రం ఏమిటంటే :  మనం ఆగి ఎదురు చూడాల్సిన సందర్భాలగుండా వెళితేనే, మనలో సహనం అభివృద్ధి అవుతుంది. తొందరగా ప్రతిఫలాలు రాని సందర్భాలు, భరించడం, ఓర్చుకోవడం, పట్టుదల, సత్తువ వంటివి, బలవంతంగా "సాధన" చేయాల్సిన అవసరం కొన్ని పరిస్థితుల వలన రావొచ్చు. కాని అది చివరికి మనలో సహనాన్ని వృద్ధి చేస్తుంది.


నిజం చెప్పాలంటే, ఆత్మ ఫలంలో ఏ ఒక్కటీ సహజంగా రాదు, అది బైబిల్ చెప్పే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం, ఆశానిగ్రహం, వీటిల్లో ఏదైనా (గలతీ 5:22-23).


కనుక ఈసారి మీరెప్పుడైనా, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడానికి ఎదురుచూస్తుంటే, ఎందుకు ఆ సమయంలో ఈ వచనాలు చదవకూడదు :


~ నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. (రోమీయులకు 12:12)


~ మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము. (గలతీయులకు 6:9)


~ దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. (ఫిలిప్పీయులకు 4:6,7)


~ కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. (కొలొస్సయులకు 3:12)


~ సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి. (1 థెస్సలొనీకయులకు 5:14)


The Evolution of Patience


మనలో "వేచి చూసే" సామర్ధ్యాన్ని, టెక్నాలజీ మార్చేసింది. బైబిల్ చెప్పే సహనం యొక్క అవసరత ఈరోజు వాక్యధ్యానంలో!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.