కొట్టి, చెరశాలలో పడేసిన తర్వాత నువ్వు పాటలు పాడగలవా?

దేవుణ్ణి అధికంగా ప్రేమించిన కొంతమంది అద్భుతమైన సేవకుల గురించి తెలుసుకొని స్ఫూర్తిని పొందాలని ఆశపడుతున్నావా, అయితే ఈరోజు వాక్యధ్యానం చదువు!


134 వ కీర్తనలో కేవలం మూడు వచనాలు, యాభై మాటల కంటే తక్కువే ఉంటాయి. కాని మొదటి వచనంలోనే నేనొక అద్భుతమైన సత్యాన్ని కనుగొన్నాను :


యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి. (కీర్తనలు 134:1)


నిర్గమకాండము 27:20, 21 లో, ప్రత్యక్షపు గుడారం గురించి యాజకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఈ విధంగా ఉంది. "దీపము నిత్యము వెలిగించునట్లు... సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను"


ఈ వచనం అనేక ముఖ్యమైన బైబిల్ సత్యాలను గురించి నన్ను ఆలోచింప చేసింది :


🌟 మన జీవితం ఎంత చీకటిగా అనిపించినా, దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉంది (కీర్తన 119:105).


🌟 యేసు ప్రభువు లోకానికి వెలుగై ఉన్నారు, ఆయనే మనలను చీకటిలో నడవకుండా కాపాడతారు (యోహాను 8:12).


🌟 క్రైస్తవులు ఈ చీకటి ప్రపంచానికి వెలుగై ఉంటూ దేవునికి మహిమ తేవడానికి పిలవబడ్డారు (మత్తయి 5:16).


చీకటిలో వెలుగు ప్రకాశించడం అనేదానికి ఒక అద్భుతమైన దృష్టాంతం అపో. కార్యములు 16 లో వ్రాయబడిన పౌలు సీలల పరిచర్యలో జరిగిన ఒక సంఘటనలో మనం చూస్తాం. వారు అన్యాయంగా కొట్టబడి, చెరశాలలో పడవేయబడ్డారు. కాని అంత చీకటి మధ్యలో, "అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి." (అపొ. కార్యములు 16:25).


దయచేసి కొంత సమయం తీసుకొని అపొ. కార్యములు 16వ అధ్యాయం చదవమని నా మనవి. "యెహోవా మందిరంలో దేవునికి రాత్రి సేవలు చేసే సేవకుల" గురించి ఒక అద్భుతమైన కధ అందులో వ్రాయబడి ఉంది.


ఈరోజు మన ప్రపంచం చీకటిలో ఉంది. దేవుని వాక్యం వెక్కిరించబడటం, పాపాన్ని పండుగ చేసుకోవడం, దేవుని బిడ్డలు అన్యాయంగా నిందించబడటం వంటివి.

మనం ప్రకాశించాలి, ప్రియ క్రైస్తవులారా, మనం ప్రకాశిద్దాం!


Would You Be Singing in Prison after a Beating?


దేవుణ్ణి అధికంగా ప్రేమించిన కొంతమంది అద్భుతమైన సేవకుల గురించి తెలుసుకొని స్ఫూర్తిని పొందాలని ఆశపడుతున్నావా, అయితే ఈరోజు వాక్యధ్యానం చదువు!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.