మనకు ప్రభువంటే ప్రేమ ఉన్నప్పటికీ, క్రైస్తవులమైన మనం ప్రభువును తరుచు వింతైన ప్రశ్నలు అడుగుతుంటాం.
ఉదాహరణకు:
ఎందుకు ఎప్పుడు నాకే చెడు జరుగుతుంది? అసలు అలా జరగకుండా దేవుడు ఆపొచ్చు కదా?
మన ప్రశ్నలకు దేవుడేమీ చిన్నబుచ్చుకోడు. మనం యదార్ధంగా అడగాలనే కోరుకుంటాడు. కాని మనం మనమున్న పరిస్థితులను కూడా అర్ధం చేసుకోవాలని కోరుకుంటాడు. ఆయన ఒక పరిపూర్ణమైన ప్రపంచాన్నే సృష్టించాడు, కాని మానవుడే దాన్ని పాడుచేసాడు. చెడు విషయాలు మనకు జరుగుతాయి, ఎందుకంటే మనందరం పాపులం, పాడైపోయిన ప్రపంచంలో జీవిస్తున్నాం.
అసలు అడగవలసిన ప్రశ్నలు ఏమిటంటే:
💙 ఎందుకు దేవుడు మనలను ఇంతగా ప్రేమిస్తున్నాడు?
💙 ఎందుకు దేవుడు సమస్యల్లో ఉన్న మనకు సహాయం చేయాలని ఇంతగా ఇష్టపడుతున్నాడు?
💙 ఎందుకు దేవుడు మనకోసం ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు?
మనకు సరైన దృక్పధం ఉన్నప్పుడు దేవుణ్ణి వేరే ప్రశ్నలు అడుగుతాం, ఆ సరైన దృక్పధం పొందడానికి ఒక ముఖ్య పద్దతి వాక్యాన్ని చదవడమే.
ఈ క్రింది వచనాలు సహాయంగా తీసుకో:
• లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను. (యోహాను 16:33)
• శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. (యోహాను 14:27)
• నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను (హెబ్రీయులకు 13:5)