#2: దుఃఖపడువారు ధన్యులు

రెండవ ధన్యతను చదివి, దైవచిత్తానుసారమైన దుఃఖం గురించి తెలుసుకుందాం!


"దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు". (మత్తయి 5:4)


1. ఎవరైతే వారి పాపాల గురించి దుఃఖపడతారో, వారు ఓదార్చబడతారు.


దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. (2 కొరింథీయులకు 7:10)


పశ్చాతాపంతో దుఃఖపడితే, క్షమాపణ అనే ఆదరణ పొందుతాం (1 యోహాను 1:9).


2. మనుషులు దేవుని తిరిస్కారిస్తే, దుఃఖపడినవారు ఓదార్చబడతారు.


యిర్మియ దేవుని ఎంతో ప్రేమించాడు, దేవుని తిరస్కరించే తన దేశ ప్రజల కోసం ఎంతో దుఖించాడు (యిర్మియ 23:9-10).


లోకంలో ఉన్న చెడును చూసి దుఃఖపడితే, దేవుని సంతోషపెట్టిన ఆదరణ పొందుతాం (ఎఫెస్సీ 5:8-11).


3. భూసంబంధమైన కష్టాలకు దుఃఖపడేవారు, ఓదార్చబడతారు.


మనం శ్రమల్లో ఉన్నప్పుడు దుఃఖపడటం సహజమే కాని ఈ దుఃఖం సంతోషంతో కలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయాల్లో దేవుని ఆదరణ పొందుతాం, అంతేకాకుండా, మన విశ్వాసం బలపడుతుంది (రోమా 12:15; 2 కొరింధీ 1:3-5; 1 పేతురు 1:6-7).


దైవచిత్తానుసారమైన దుఃఖము తప్పకుండా ఆదరణను, శుద్ధమైన మనస్సాక్షిని, దేవుని సంతోషపెట్టాలి అనే లోతైన కోరికను, దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని మనలో కలిగిస్తుంది.


దుఃఖపడువారు ధన్యులు!


# 2: Blessed are Those who Mourn


రెండవ ధన్యతను చదివి, దైవచిత్తానుసారమైన దుఃఖం గురించి తెలుసుకుందాం!


#1: ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు

నీవు "ఆత్మయందు దీనత్వాన్ని" కలిగి ఉండాలని ఆశిస్తున్నావా? ఈ వాక్యధ్యానం, నీవు ఎందుకు అలా ఉండాలో వివరిస్తుంది!


దేవుని మార్గాలకు మనుషుల మార్గాలకు మధ్య వ్యత్యాసాన్ని చూపే ఉదాహరణలే ఈ గొప్ప ఆత్మసంబంధమైన ఐశ్వర్యంతో నిండిన ధన్యతలు.


మొదటిగా :


ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. (మత్తయి 5:3)


దీనత్వం (లేక బీదరికం) అంటే మనం ఒక ప్రతికూలమైనదిగా భావిస్తాం.. అది ఆర్ధిక పరిస్థితులైనా, చదువులు, ఎలా కనపడుతున్నాం, ఆరోగ్యం, ఇలా ఇంకా ఎన్నో పరిస్థితులు.


కాని ఆఖరికి దేవుడు అన్నింటినీ తారుమారు చేస్తాడు. ఆయన మార్గాలు ఈ లోకపు మార్గాల వంటివి కావు (యెషయా 55:8-9).


ఆలయంలో ఉన్న సుంకరి ఆత్మయందు దీనత్వాన్ని కలిగి ఉన్నాడు (లూకా 18:9-14). తన పాపస్థితిని అలాగే దేవుని కృప యొక్క అవసరతను పూర్తిగా అర్ధం చేసుకున్నవాడు.


అలాంటి వారు తమను తాము చేతులు చాపి దేవుని కనికరాన్ని వేడుకునే బిచ్చగాళ్ళు లాగా చూసుకుంటారు. వారు త్వరగా, నిజాయితీగా పశ్తాతాపపడతారు అంతే కాకుండా దేవుని నుండి వారు పొందిన ఆ కనికరాన్నే ఇతర పాపులకు చూపుతారు.


వారు ఈ లోకంలో ధనవంతులు లేక బీదవారు కావొచ్చు, ప్రపంచానికి తెలిసినవారు లేక తెలియని వారు కావొచ్చు, చదువుకున్న వారు లేక చదువుకోని వారు కావొచ్చు.. కాని క్రీస్తు సిలువ దగ్గర తమను తాము పెట్టుకోగలిగిన దేవునికి లోబడే వినయం కలిగిన వారు.


వారు దేవుని శిక్షను, ఆజ్ఞలను, విధానాలను ప్రశ్నించరు. వారికి తెలుసు దేవుడు మాత్రమే దేవుడు కాని, వారు కాదని.


ప్రియ చదువరి, నీవు ఆత్మయందు దీనత్వాన్ని కలిగి ఉన్నావా? నిన్ను నీవే పరీక్షించుకో!


#1: Blessed Are the Poor in Spirit


నీవు "ఆత్మయందు దీనత్వాన్ని" కలిగి ఉండాలని ఆశిస్తున్నావా? ఈ వాక్యధ్యానం, నీవు ఎందుకు అలా ఉండాలో వివరిస్తుంది!


నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?

కీర్తన 8 లో దావీదు ఒక అద్భుతమైన అతిముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. వాస్తవానికి మనమందరం ఈ ప్రశ్నను అడగాలి కాని, చాలా తక్కువ మందే అడుగుతారు.


దేవుడు ఎప్పుడూ అందుబాటులోనే ఉండేవాడు, ఎప్పుడూ ఆలకించేవాడు, క్షమించడానికి సిద్దమనస్సు కలవాడు గనుకనే ఆయన ప్రేమను మనం సులభంగా తీసుకుంటాం.


కాని మన నిజాయితీని పరీక్షించుకోవడానికి కీర్తన 8:4 మనకు చాలా ఉపయోగపడుతుంది.


దావీదు దేవుణ్ణి అడుగుతాడు "నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?" అని


ఆకాశములో ఉన్న మహిమకు దావీదు ఆశ్చర్యపోతూ, అంతటి అద్భుతమైన దేవుడు ఎందుకని మనిషికి ఇంత మహిమను, ప్రభావమును, విలువను ఇచ్చాడు అని.


దేవుడు ఏ లోపము లేని లోకాన్ని సృష్టించలేదా? మనిషి దాన్ని పాడుచేయలేదా?


మనిషి యుగాలు సంవత్సరాలు తరబడి దేవుని ప్రేమను వెక్కిరిస్తూ, ఆయన్ని నిరాకరించడంలేదా?


అయినప్పటికీ ఇంత ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ పాపపు మానువులను ఎందుకు ప్రేమిస్తూనే ఉన్నాడు?


దావీదు ప్రశ్న సరైనదే!


చాలా మంది దేవుని ఎదుట తమ పిడికిళ్లు బిగించి, ఎందుకు మాకు ఎక్కువ చేయలేదని ప్రశ్నిస్తూ ఉంటే...


దావీదు మాత్రం అద్భుతంగా ఈ సూర్యచంద్రులను నక్షత్రాలను చేసిన ఆ గొప్ప సృష్టికర్త మనిషిని ప్రేమించడమేంటి అని విస్మయంతో నిండిపోయాడు.


ఇదే మనం కూడా తిరిగి చెప్పాలి : దావీదు ప్రతిస్పందన సరైనది.


కనుక అంత గొప్ప దేవుడు మనలను ప్రేమిస్తున్నారనే సత్యాన్ని లోతుగా ఆలోచించడానికి ఈరోజు కొంత సమయం తీసుకుందాం!


What Is Man that You are Mindful of Him?


కీర్తన 8 లో దావీదు ఒక అద్భుతమైన అతిముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. వాస్తవానికి మనమందరం ఈ ప్రశ్నను అడగాలి కాని, చాలా తక్కువ మందే అడుగుతారు.


గుడారాలు, నిత్యత్వం గురించి కొంత జ్ఞానసంపద

క్రైస్తవులు "గుడారాల్లో" జీవిస్తున్నారని దేవుని వాక్యం చెబుతుందని నీకు తెలుసా? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


1909 సంవత్సరంలో కోలోరోడోలో ఉన్న స్వింక్ అనే చిన్న ఊర్లో మా అమ్మమ్మ పుట్టింది. ఆ కుటుంబం ఒక గుడారంలో నివసించేవారు.


పెరుగుతున్న కుటుంబాన్ని ఆ గుడారంలో పోషించుకోవడం, కట్టెల పొయ్యి మీద వండుకోవడం, కోలోరోడోలో వచ్చే వాతావరణం మార్పులకు తట్టుకోవడం, సరైన మంచి నీరు సదుపాయం లేకుండా జీవించడం.. ఇవన్నీ నా ముత్తాతలు అనుభవించారు. వారికి ఆ రోజులు ఎంత కష్టంగా ఉండేవో నేను పూర్తిగా ఊహించలేను.


నేను కూడా గుడారంలో క్యాంప్ చేసాను కాని అందులోనే జీవించలేదు.


లేదు, ఇది నిజం కాదు!


మన శరీరం ఒక "తాత్కాలికమైన గుడారం". మన పరలోక ఇల్లు పూర్తిగా కట్టే వరుకు ఈ శరీరంలో మనం జీవిస్తున్నాం అని 2 కొరింధీ 5:1-5 లో పౌలు వివరించాడు.


మన భూసంబంధమైన గుడారాల్లో మనం సంతోషంగా ఉంటాం. కాని మన గుడారం వయస్సు మీరినప్పుడు, ప్రతికూల పరిస్థితులు అనే గాలులు వీచినపుడు, ఇబ్బందులు అనే తుఫానులు వచ్చినప్పుడు, మనం అలిసిపోయి.. 'భారముతో మూల్గుతూ' ఉంటాం. మనకు సేదతీర్చడానికి జీవజలపు ఊటలు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాయి (యోహాను 7:38) దేవుడే మన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు (సామెతలు 30:5), అయినప్పటికీ ఈ గుడారపు జీవితం అంత సులభమైనదేమీ కాదు.


ఇక్కడ ఉన్నంత కాలం మనం చేయడానికి దేవుని నుండి మనకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ, విశ్వాసులంగా మనకు ఒక వాగ్దానం ఉందని మర్చిపోకూడదు. అదేమిటంటే, ఒక రోజు మన పరలోక గృహంలో మనం చేరతాం, మన ప్రియ ప్రభువును ముఖాముఖిగా చూస్తాం (1 కొరింధీ 13:12). చావునకు లోనయ్యే మన ఈ శరీరాలు జీవం చేత మ్రింగివేయబడుతాయి (2 కొరింధీ 5:4).


ఈరోజు ఈ సత్యాన్ని మనసులో పెట్టుకో : యేసు క్రీస్తు ప్రభువు నీ రక్షకుడైతే, నువ్వు ప్రయాణించేది జీవం వైపే కాని మరణం వైపు కాదు.


భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొననపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకనుగ్రహించియున్నాడు. (2 కొరింథీ 5:1-5)


Some Insights on Tents and Eternity


క్రైస్తవులు "గుడారాల్లో" జీవిస్తున్నారని దేవుని వాక్యం చెబుతుందని నీకు తెలుసా? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


ఆఖరి అద్భుతమైన మాటలు!

సిలువ నుండి మూడు పదాలు..పాత నిబంధనలో గుసగుసలాడితే.. కొత్త నిబంధనలో బిగ్గరగా మాట్లాడింది, మన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.. ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!


విమోచకుని గురించిన దేవుని గుసగుసలు పాత నిబంధన పుస్తకం మొత్తంలో వినబడుతూనే ఉంటుంది. క్రీస్తు నిత్యత్వంలోకి పలికిన పదాల కోసం మనలను సిద్ధపరిచేందుకు దేవుని స్వరం సువార్తల్లో బిగ్గరగా వినపడుతూనే ఉంది.


"సమాప్తమైనది" యోహాను 19:30


✝️ ఈ పదమే ప్రపంచాన్ని మార్చేసింది.


✝️ ఈ పదమే ప్రతీ క్రీస్తు అనుచరుని గమ్యాన్ని మార్చేసింది.


మన పాప భారాన్నంతటిని మోసిన మన రక్షకుని ఆవేదన మరియు విజయమే ఈ పదాల సారాంశం.


మూల భాషలో అకౌంటింగ్ కి వాడే పదమే ఈ పదానికి వాడబడింది. అదే "పూర్తిగా చెల్లించబడింది" అని. ఎంత సరిగ్గా సరిపోయిందో కదా!


పూర్తిగా చెల్లించబడినది మనదే కాని క్రీస్తుది కాదని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.


"మంచి శుక్రవారం" అని మనం పిలిచుకునే రోజు, ఆయన మన కోసం పొందిన క్రూరమైన శ్రమానుభవాన్ని అలానే చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత పవిత్రమైన ఆయన ప్రేమను ఒకేసారి చూపిన దేవుని మనం ఆరాధించుకునే రోజు.


రోజూ మనం సవాలులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, మన తలంపులు, మాటలు, హృదయాలు, క్రీస్తు సిలువపై నుండి పలికిన ఆ ఆఖరి పదాలపైనే నిలుచును గాక!


"సమాప్తమైనది"


మన పాపభారం పూర్తిగా చెల్లించబడింది!
హల్లెలూయా!


3 Incredible Words!


సిలువ నుండి మూడు పదాలు..పాత నిబంధనలో గుసగుసలాడితే.. కొత్త నిబంధనలో బిగ్గరగా మాట్లాడింది, మన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.. ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!



ఆధునిక మోసాలు!


అనేకమంది ఆధునిక క్రైస్తవులు, యిర్మియా కాలంలోలానే అబద్ద ప్రవక్తల 'మంచి భావాలతో' కూడిన బోధలు వినడానికే ఇష్టపడతారు. క్రీస్తు బోధకు, ఇటువంటి బోధకు మధ్య వ్యత్యాసాన్ని ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!


పాపులర్ బోధకుల్లో చాలా మంది పాపం, నరకం గురించి చెప్పడం కంటే, ప్రజలు వారిని వారు మంచివారిగా భావించుకోవాలనే ఎక్కువ చెప్తారు. కాని యేసు వారిలా కాదు. తరుచూ ఆయన బోధ పశ్చాతాపం, తగ్గింపు, త్యాగం, పాపం, నరకం గురించే ఎక్కువ ఉండేది. (1)


చాలా మంది పాపులర్ బోధకులు సంపన్నమైన జీవితాన్ని జీవిస్తూ, తన పిల్లలు ధనవంతులుగా, సౌకర్యవంతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని నొక్కి చెప్తుంటారు. కాని యేసు ప్రభువు ఒక సొంత స్థలం కూడా లేని జీవితాన్ని జీవించాడు, ధనమే తరుచూ మనుషులను పాడుచేస్తుందని బోధించాడు. (2)


మంచి అనుభూతినిచ్చే సందేశాలు ఎక్కువ ప్రజాదరణ పొందుతాయి :


దేవుని ప్రజలకు పశ్చాతాపం పొంది, నాశనాన్ని తప్పించుకోమని యిర్మియా హెచ్చరించాడు.


కాని యిర్మియా కాలంలో ఉన్న పాపులర్ "ప్రవక్తలు", చింతించకండి, మీకు ఎటువంటి అపాయం రాదు, మీకు సమాధానం అని ప్రభువు చెబుతున్నాడని ప్రకటించారు.


ఇలా అబద్దాలు చెప్పే ప్రవక్తలు అప్పటి ప్రజలను తమను గురించి తాము మంచిగా భావించుకునేలాగ తయారుచేసారు.


కాని యిర్మియా మాటలే నిజమని నిరూపించబడ్డాయి.


పాపం, నరకం గురించి అర్ధం చేసుకోలేకపోతే, దేవుని అద్భుతమైన కృపాకనికరాలు ఎప్పటికీ అర్ధం చేసుకోలేము. ప్రస్తుత జీవితంలో ధనం కోసం ప్రాకులాడితే, పరలోకంలో ధనాన్ని పోగొట్టుకుంటాం.


ప్రేరణ కలిగించే మంచి భావాలతో కూడిన బోధలు వినడం మాని, యదార్థమైన బైబిల్ బోధకుల బోధలే వినడానికి జాగ్రత్తపడదాం.


నోట్ :


(1) మత్తయి 10:38


(2) ధనాన్ని గురించి క్రీస్తు మాటల్లో :


కొంతమంది క్రైస్తవులకు దేవుడు ధనాన్ని తన ప్రణాళికలు వారు నెరవేర్చడం కోసం ఇస్తాడు అంతేకాని ధనాన్ని దేవుడు వాగ్దానం చేయలేదు, ధనం కలిగి ఉండటం విశ్వాసానికి గురుతు కాదు. మత్తయి 6:19-21 మనం ధనాన్ని పరలోకంలో సమకూర్చుకోవాలి అని ఉంది కాని భూమిపై కాదు.


ధనం మోసకరమైనదని, మన ఆత్మీయ పరిపక్వతకు విశ్వాసానికి అది ఎప్పుడూ అడ్డుపడుతుంటుందనే భావన మత్తయి 13:22 లో చూస్తాం.


ఇతరుల విశ్వాసాన్ని వారికున్న ధనాన్ని బట్టి తీర్పు తీర్చడం సరైనది కాదని లూకా 12:15 చెబుతుంది.


ధనం గురించి ఇతర వాక్యభాగాలు :

• లోకభోగాలు కోసం చేసే ప్రార్ధనలు జవాబును పొందవని యాకోబు 4:3 లో వ్రాయబడింది.


• లోకానుశారమైన వస్తువుల గురించిన అత్యాశ, విగ్రహారాధనగా కొలస్సీ 3:5 లో వ్రాయబడింది.


• సంతృప్తి విశ్వాసానికి గుర్తని 1 తిమోతి 6:6-10 చెబుతుంది. మనకు తినడానికి ఆహరం, వేసుకోవడానికి బట్టలు ఉంటే వాటితో సంతృప్తిగా ఉండాలి. ధనాశ మనలను దేవుని నుండి దూరం చేస్తుంది.


• ధనానికి విశ్వాసానికి ఎటువంటి సంబంధం లేదని యాకోబు 2:5 చెబుతుంది. సాధారణంగా బీదవారే ఎక్కువ విశ్వాసం చూపుతారు!


Modern Deceptions


అనేకమంది ఆధునిక క్రైస్తవులు, యిర్మియా కాలంలోలానే అబద్ద ప్రవక్తల 'మంచి భావాలతో' కూడిన బోధలు వినడానికే ఇష్టపడతారు. క్రీస్తు బోధకు, ఇటువంటి బోధకు మధ్య వ్యత్యాసాన్ని ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!


క్రైస్తవ్యం, హిందు కర్మ సిద్ధాంతం రెండు ఒకదానితో ఒకటి పొంతన లేనివి!

చాలామంది క్రైస్తవులు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు, దానినే నేను 'క్రైస్తవ కర్మ' అంటాను. అందుకే దేవుని వాక్యం ఏమి బోధిస్తుందో కచ్చితంగా అర్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం.


"క్రైస్తవ కర్మ" అనే కొత్త సిద్ధాంతాన్ని వారు స్వీకరించినట్టు కొంతమంది క్రైస్తవులు  గుర్తించలేకపోతున్నారు.


మంచి వారికి చెడు (ఉదా: యోసేపు, అపో. పౌలు), చెడ్డ వారికి మంచి జరగడం  సాధారణం అని గుర్తించాల్సింది బదులు, ప్రతీ సమస్య పాపంతోనే ముడిపడి ఉందని వారి ఆలోచన.


యోబు స్నేహితులులాగా వారు ఆ సమస్యలు పొందడానికి ఏదోరకంగా అర్హులై ఉంటారని వారి ఆలోచన.


ఇది నిజంగా వాక్యానుశారమైనది కాదు. ఎవరైతే శ్రమలగుండా వెళ్తున్నారో, వారిపై అన్యాయంగా బరువును మోపడం వంటిదే ఈ ఆలోచన. పాపానికి సమస్యకు స్పష్టమైన సంబంధం ఉన్న ఉదాహరణలు ఒకటి (ఉదా: త్రాగుబోతుకు లివర్ పాడవ్వడం లేక వ్యభిచారం చేసిన యవ్వనురాలు గర్భిణి కావడం). కాని ఎటువంటి స్పష్టమైన సంబంధం లేకపోయినా, శ్రమల్లో ఉన్న వ్యక్తులను తీర్పు తీరిస్తే అదే "క్రైస్తవ కర్మ" అవుతుంది.


యోహాను 9:2,3 లో అనారోగ్యం ఎప్పుడూ పాపం వల్లే వస్తుందని శిష్యులు అనుకున్నప్పుడు, యేసు ప్రభువు వారిని సరిచేశారు. బ్రతికి బయటపడి జీవిస్తున్న వారు ఎంత అర్హులో, రాజకీయ పరిస్థితుల వల్ల వధింపబడిన వారు, గోపురం పడి చచ్చిన వారూ అంతే అర్హులని, లూకా 13:1-5 లో యేసు ప్రభువు చెప్పారు.


గలతీ 6:7-8 లో మనిషి ఏది విత్తితే ఆ పంటనే కోస్తారని వ్రాయబడింది. కాని ఇది కర్మ సిద్ధాంతంలాగ కాదు, దేవుడు అటువంటి న్యాయం ఇక్కడే ఈ భూమిపై ఉండగానే ఇస్తానని వాగ్దానం చేయలేదు (1 థెస్సలొనిక 1:6-7) అంతేకాదు, నీతిగా జీవించే వారికి ఈ భూమిపై ఏ సమస్యలు ఉండవు అని కూడా దేవుడు వాగ్దానం చేయలేదు (యోహాను 16:33).


మనం పూర్తిగా క్రైస్తవులంగా ఉందాం. క్రైస్తవ్యాన్ని హిందుత్వాన్ని కలపడం విడిచిపెడదాం (కొలస్సీ 2:8).


Christianity and Karma are not Compatible


చాలామంది క్రైస్తవులు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు, దానినే నేను 'క్రైస్తవ కర్మ' అంటాను. అందుకే దేవుని వాక్యం ఏమి బోధిస్తుందో కచ్చితంగా అర్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం.